• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అత్యంత కట్టుదిట్టంగా 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యాచరణ

KMM: ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యాచరణ అత్యంత కట్టుదిట్టంగా చేపడుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం అధికారులతో సమావేశమయ్యారు. MAR 6 నుంచి JUN 12 వరకు ప్రభుత్వ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

March 2, 2026 / 05:16 PM IST

‘ప్రజలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి’

అసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌ కె.హరితని సోమవారం కాగజ్‌నగర్ మున్సిపల్ నూతన పాలకవర్గం వైస్ ఛైర్మన్, BRS కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. వారందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణానికి సంబంధించిన పలు ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

March 2, 2026 / 05:14 PM IST

సీఏ ఫైనల్లో ఉత్తీర్ణత సాధించిన సాయికుమార్

KMR: జిల్లాలో తాజాగా విడుదలైన ఛార్టర్డ్ అకౌంటెంట్స్ (సీఏ) ఫైనల్ ఫలితాల్లో మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన సాయికుమార్ నీలావర్ ఉత్తీర్ణత సాధించారు. ఆయన తండ్రి మాజీ ఉప సర్పంచ్ మల్లికార్జున నీలావర్. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, పట్టుదలతో కృషి చేసి ఈ విజయాన్ని సాధించినట్లు సాయి తెలిపారు.

March 2, 2026 / 05:14 PM IST

గ్రామాల అభివృద్ధి లక్ష్యం: ఎమ్మెల్యే

PDPL: జూలపల్లి మండలం వెంకటాపూర్ గ్రామం నుంచి కాచాపూర్ గ్రామం వరకు నిర్మిస్తున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సోమవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.

March 2, 2026 / 05:10 PM IST

మాజీ స్పీకర్‌కు ఎస్పీ నివాళులు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నైతిక విలువలతో, ప్రజల పట్ల అంకితభావంతో సేవలందించిన నాయకుడు శ్రీపాద రావు అని స్మరించుకున్నారు.

March 2, 2026 / 05:09 PM IST

కలెక్టరేట్‌లో శ్రీపాదరావు జయంతి

NLG: దివంగత శాసన సభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ చంద్రశేఖర్, పలువురు అధికారులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

March 2, 2026 / 05:08 PM IST

‘ప్రజావాణి దరఖాస్తులపై తక్షణ చర్యలు చేపట్టండి’

SRPT: ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన 83 దరఖాస్తులను స్వీకరించారు. భూ సమస్యల దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పెండింగ్‌ దరఖాస్తులను శాఖల వారీగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

March 2, 2026 / 05:07 PM IST

ప్రజావాణికి 164 దరఖాస్తులు

SRCL: జిల్లా కలెక్టరేట్ సోమవారం ప్రజావాణి నిర్వహించగా, 164 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖకు 61, గృహ నిర్మాణ శాఖకు 25, జిల్లా పంచాయతీ కార్యాలయం, డీఆర్డీఓకు 13 చొప్పున, సంక్షేమ శాఖకు- 09, ఉపాధి కల్పన శాఖకు – 08, వచ్చాయన్నారు.

March 2, 2026 / 05:05 PM IST

వివాహ శుభకార్యానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

BHNG: అడ్డగూడూర్ మండలం అజీంపేట బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ కన్నేబోయిన ఎలేందర్ కుమారుడు కిరణ్ వివాహం సందర్బంగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్‌ను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు లింగాల మధు గౌడ్, చిరంజీవి, రాకేష్ పాల్గొన్నారు.

March 2, 2026 / 05:03 PM IST

హోలీ: వినోదం కాకూడదు విషాదం..!

VKB: కొడంగల్ వ్యాప్తంగా రేపటి నుంచి హోలీ సంబరాలు మొదలు కానున్న నేపథ్యంలో వైద్య నిపుణులు పలు కీలక సూచనలు చేస్తున్నారు. హోలీ సంబరాల్లో రసాయనిక రంగులు వినియోగించ వద్దని హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నారులు రసాయనాల వల్ల తాత్కాలిక కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉందని, సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికే పూలతో రంగులు తయారుచేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

March 2, 2026 / 05:02 PM IST

ప్రజావాణికి 123 ఫిర్యాదులు

NLG: జిల్లా కలెక్టరేట్‌లో ఇవాళ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారి నుంచి మొత్తం 123 ఫిర్యాదులు వచ్చాయి. అందులో రెవిన్యూ శాఖకు 59, ఇతర శాఖలకు 64 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంఛార్జ్ అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, ఆర్డీవోలు పాల్గొన్నారు.

March 2, 2026 / 05:02 PM IST

హాకా సెంటర్‌ను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి

NRPT: జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ సోమవారం ఊట్కూర్ మండల కేంద్రంలోని హాకా సెంటర్‌ను తనిఖీ చేశారు. రైతులకు యూరియా కొరత రాకుండా చూసుకోవాలని, ప్రస్తుత అవసరాలకు మేర కొనుగోలు చేయాలని సూచించారు. యూరియా యాప్ ద్వారానే విక్రయాలు జరపాలని ఆదేశించారు. పాస్ మెషిన్, యాప్, రిజిస్టర్, ఫిజికల్ స్టాక్ బ్యాలెన్స్ సమానంగా ఉండేలా ఫర్టిలైజర్ డీలర్లకు సూచనలు ఇచ్చారు.

March 2, 2026 / 05:02 PM IST

ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు: మున్సిపల్ ఛైర్మన్

BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఛైర్మన్ బుర్ర కొమురయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో మున్సిపల్ ఛైర్మన్ కొమురయ్య విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తామని చెప్పారు.

March 2, 2026 / 05:00 PM IST

‘లైసెన్స్ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించండి’

NGKL: జిల్లా లైసెన్స్ సర్వేయర్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా సర్వే అధికారి గిరిధర్ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఉన్నటువంటి లైసెన్స్ సర్వేయర్ల సమస్యలను పరిష్కరించి ఆర్థిక భరోసా, భద్రతను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, దినేష్ మల్లికార్జున్, అరవింద్, శివుడు ప్రశాంత్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 05:00 PM IST

గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ

NRML: మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఏఎంసీ ఛైర్మన్ పడిగల భూషణ్ అన్నారు. ఎమ్మెల్యే బుజ్జి పటేల్ ఆదేశాల మేరకు కడెం మండలంలోని ఎలకడప గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ కార్యాలయం, వివో భవన నిర్మాణాలకు వారు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ రహీం, మహమ్మద్ సలీం ఉన్నారు.

March 2, 2026 / 05:00 PM IST