NLG: తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రజావేదిక కార్యక్రమం జరగనుందని చిట్యాల ఎంపీడీవో జయలక్ష్మి తెలిపారు. ఈ నెల 4న బుధవారం ఉ. 10 గంటలకు చిట్యాలలోని మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీలు జరగనున్నాయి. మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక ఉంటుందని తెలిపారు.
SRPT: కోదాడ పట్టణంలో శనగల రాధాకృష్ణ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాధ ఆశ్రమంలోని మానసిక వికలాంగులు, చిన్నారులకు మంగళవారం హోళీ సందర్భంగా అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన జంపాల వెంకన్న-ఉమా దంపతుల ఆర్థిక సహకారంతో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సేవా సంస్థ తరఫున దాతకు అభినందనలు తెలిపారు.
BHNG: శ్రీ భవాని రామలింగేశ్వరా స్వామి కళ్యాణమహోత్సవం, బ్రహ్మోత్సవం సందర్భంగా స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డికి దేవాలయ కమిటీ ఛైర్మన్ గుండగోని రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఛైర్మన్ గడ్డం స్వప్న, సోమనర్సయ్య ఘనంగా స్వాగతం పలుకగా, ప్రత్కేక పూజలు చేసి కళ్యాణంలో పాల్గొన్నారు.
HYD: GHMC విభజన తర్వాత ఖజానా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సుమారు ₹3,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు చర్యలకు దిగారు. బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ అయ్యాయి. గడువులోగా చెల్లించకుంటే ఆస్తులను జప్తు చేయొచ్చు. విడ్డూరమేంటంటే.. ప్రభుత్వ భవనాలే దాదాపు ₹1,000 కోట్లు బకాయి ఉన్నాయి.
NZB: అంతర్రాష్ట్ర ట్రాన్స్ ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు CP సాయిచైతన్య తెలిపారు. ముధోల్, భైంసాకు చెందిన 10 మంది ముఠా సభ్యులు పంట పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్‌లను చోరీ చేసినట్లు వెల్లడించారు. నిందితుల్లో ఏడుగురిని అరెస్టు చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
MDK: చేగుంటలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సహకారంతో స్పందన కల్చరల్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్ స్కోప్ ఆధ్వర్యంలో హెచ్ఐవీ ఎయిడ్స్, టీబీ నియంత్రణపై అవగాహన కళాజాత ప్రదర్శన చేపట్టారు. కనకదుర్గ కళా సమితి భుజంగం పొన్నాల బృందం కళాకారులు తమ ఆటపాటలతో హెచ్ఐవీ ఎయిడ్స్‌పైన ప్రజలను చైతన్యపరిచి అవగాహన కల్పించారు.
KMR: లింగంపేటలో భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయికుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కోరారు.
PDPL: ఓదెల మండలంలోని గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం రేపటి (బుధవారం) నుంచి ప్రారంభమవుతుందని MPDO అనిల్ రెడ్డి తెలిపారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం, ఐకేపీ మీటింగ్ హాల్లో ఈ శిక్షణ జరుగుతుంది. గ్రామ పంచాయతీ విధులు, నియమ నిబంధనలు, అభివృద్ధి కార్యక్రమాలపై టీఓటీలు ద్వారా అవగాహన కల్పించనున్నారు. వార్డు సభ్యులు హాజరు కావాలన్నారు.
SDPT: బెజ్జంకి మండలం దాచారంలో విద్యుత్ సరఫరా మెరుగుదలకు సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచనలతో పనులు పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ బైరి మానస రాజేందర్ విద్యుత్ శాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
NRPT: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం ఈనెల 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలు లేదా బహిరంగ సభలు నిర్వహించకూడదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
NGKL: మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాతృమూర్తి మంగమ్మ ఇవాళ మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చల్లంపల్లి గ్రామానికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను పరామర్శించారు. అనంతరం మంగమ్మ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట పొల్యూషన్ బోర్డు మెంబర్ ఠాగూర్ బాలాజీసింగ్, తదితరులు ఉన్నారు.
KNR: ఇటీవల ములుగు జిల్లా మేడారంలోని ఆడిటోరియం హాల్లో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఈ కరాటే పోటీలో హుజురాబాద్ చెందిన మండ సాన్విత గోల్డ్ మెడల్ సాధించినట్లు స్థానిక బీబీఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్ భూసారపు బాబురావు, రాజ్ కుమార్ తెలిపారు. కుమతి కట్టా విభాగంలో ఏడుగురు విద్యార్థులు సైతం గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో శివ కళ్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాటు చేయాలని ఆలయ ఈవో రమాదేవి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఐదు రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాలలో భాగంగా 6వ తేదీ స్వామివారి కళ్యాణం, 8వ తేదీ రథోత్సవం నిర్వహిస్తామని, కళ్యాణోత్సవానికి వేలాది మంది తరలివచ్చే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేయాలని అన్నారు.
NRML: నిర్మల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ద్వంద్వ రాజకీయాలను ఎండగడతామని బీజేపీ నేత రావుల రామనాథ్ హెచ్చరించారు. తైబజార్ సమస్యపై అధికార పార్టీ నేతలు డ్రామాలు ఆపాలని డిమాండ్ చేశారు. సొంత ప్రభుత్వమే ఉన్నందున సమస్యను పరిష్కరించాలని, లేదంటే ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు.
PDPL 6కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. భార్య ఐదేళ్లుగా కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురైన కందునూరి రాజకుమార్ తన గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంటరితనం కారణంగా మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.