• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘విద్యార్థి నాగవర్ధన్ ఆచూకీని త్వరలోనే కనుగొంటాం’

MNCL: అదృష్యమైన MJP గురుకుల పాఠశాల విద్యార్థి నాగవర్ధన్ ఆచూకీని త్వరలోనే కనుగొంటామని చెన్నూర్ టౌన్ CI బన్సీలాల్ తెలిపారు. విద్యార్థి కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడి వారికి దైర్యం అందించారు. పట్టణంలోని సీసీ కెమెరాల ఆధారాలను సేకరిస్తున్నామని, బాబును సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగిస్తామని భరోసా ఇచ్చారు. కుటుంబీకులు ధైర్యంగా ఉండాలన్నారు.

March 5, 2026 / 11:55 AM IST

ఇచ్చోడలో పెరిగిన ట్రాఫిక్ రద్దీ

ADB: ఇచ్చోడలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జటిలమవుతోంది. వాహనదారులు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా రోడ్లపైనే వాహనాలు నిలుపుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా పాదచారులు నడవడానికి కూడా వీలులేకుండా వాహనాలు అడ్డంగా ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు.

March 5, 2026 / 11:54 AM IST

వ్యవసాయ పొలంలో రైతు ఆత్మహత్య

GDWL: మల్దకల్ గ్రామానికి చెందిన కుమ్మరి శేషన్న అనే రైతు గురువారం తన వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన తోటి రైతులు వెంటనే సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే శేషన్న బలవన్మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 5, 2026 / 11:51 AM IST

రెండు బైకులు ఢీ.. ఇద్దరు మహిళలకు గాయాలు

BDK: మణుగూరు మండలంలోని గుట్టమల్లారంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు స్పందించి, క్షతగాత్రులను మణుగూరులోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 5, 2026 / 11:51 AM IST

అధ్వానంగా మారిన గోదావరి నది స్నాన ఘట్టాలు

MNCL: మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది స్నాన ఘట్టాలు అస్తవ్యస్తంగా మారాయి. దేవదాయ శాఖ, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ కరువవడంతో ఘట్టాలపై పాకురు పేరుకుపోయి ప్రమాదకరంగా తయారయ్యాయి. పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు జారిపడుతూ ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ఘట్టాలను శుభ్రం చేయించాలని కోరారు.

March 5, 2026 / 11:48 AM IST

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగావకాశాలు

PDPL: నిరుద్యోగ యువతీ-యువకులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9న గుంటూరులో అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించబడుతుంది. 2027 నియామకాల కోసం మార్చి 10లోపు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ ఉండాలని సూచించారు.

March 5, 2026 / 11:47 AM IST

డ్రంకెన్ డ్రైవ్‌లో SR నగర్ టాప్.!

HYD: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో గత 14 నెలల్లో పట్టుబడినవారి నుంచి ఏకంగా రూ. 14 కోట్ల జరిమానా వసూలైంది. ముఖ్యంగా SR నగర్ పరిధిలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, పట్టుబడిన ఉద్యోగుల వివరాలను వారి కార్యాలయాలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ కాగా, నలుగురు ప్రైవేటు ఉద్యోగాలు కోల్పోయారు.

March 5, 2026 / 11:47 AM IST

అధ్వానంగా సూచిక బోర్డు పరిస్థితి

KMM: తల్లాడ మండల జాతీయ ప్రధాన రోడ్డుపై ఇరువైపులా ఉన్న సూచిక బోర్డులు అగమ్య గోచరంగా మారిందని స్థానికులు గురువారం తెలిపారు. ప్రయాణికులు ఎటు పోవాలో తెలుసుకోలేని సందిగ్ధలో పడుతున్నారని తెలిపారు. ఈ బోర్డు ద్వారా కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు ఒక దగ్గరికి వెళ్లిపోగా మరో దగ్గరికి మల్లుతున్నామని తెలిపారు. వెంటనే R&B అధికారులు

March 5, 2026 / 11:46 AM IST

బస్తీ దవాఖానాలను తనిఖీ చేసిన మున్సిపల్ ఛైర్మన్

VKB: కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 11, 1 వార్డుల్లోని బస్తీ దవాఖానాలను మున్సిపల్ ఛైర్మన్ నందారం ప్రశాంత్, కమిషనర్ బలరామ్ నాయక్ తనిఖీ చేశారు. రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నెలలుగా హాజరు రిజిస్టర్ లేకుండా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా డీఎంహెచ్‌వో, డిప్యూటీ డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు.

March 5, 2026 / 11:40 AM IST

వేల్పూర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు

NZB: వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద గంజాయి విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 47 గ్రాముల చరాస్, 29 గ్రాముల గంజాయి, ఒక బైక్, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో భీంగల్‌కు చెందిన అఖిల్, సోహైల్‌తో పాటు నాందేడ్‌కు చెందిన వ్యక్తి, వేల్పూరు చెందిన మైనర్ ఉన్నట్లు పోలీసులు గురువారం తెలిపారు.

March 5, 2026 / 11:39 AM IST

కెనాల్ వద్ద మోటార్ల చోరీ

KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు శివారులోని కాకతీయ కాలువ వద్ద భారీ దొంగతనం జరిగింది. ఇక్కడ మోటార్లు ఏర్పాటు చేసుకొని సాగు చేసుకుంటున్న సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన రైతులపై దొంగలు కన్నేశారు. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 16 విద్యుత్ మోటార్లను అపహరించుకుపోయారు. ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు మోటార్లు కనిపించకుండా పోయాయి అని వాపోయారు.

March 5, 2026 / 11:37 AM IST

పాఠశాల విద్యార్థులకు పెన్నుల పంపిణీ

GDWL: శాంతినగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు కోసం ఐనవోలు ఆలయ ఈవో సత్యనారాయణ రాజు పంపిన పెన్నులు పట్టణానికి చెందిన గాయత్రి శ్రీనివాసులు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయులు మద్దిలేటి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

March 5, 2026 / 11:37 AM IST

విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత స్థాయి

GDWL: విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అయిజ మున్సిపల్ ఛైర్మన్ సీఎం సురేష్ పేర్కొన్నారు. గురువారం జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణా తరగతులు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తరగతులు టీచర్లు చెప్పే పాఠ్యాంశాలు శ్రద్ధగా విని, గుర్తుంచుకోవాలన్నారు.

March 5, 2026 / 11:35 AM IST

వసంతపూర్లో గ్రామసభ కార్యక్రమం

NGKL: బిజినేపల్లి మండలం వసంతపూర్ గ్రామంలో ఈ రోజు ఉదయం సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ నిర్వహించారు. ఈ గ్రామసభలో గ్రామంలో ఏ ఏ పనులు పెండింగ్లో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ పనులన్నీ త్వరలోనే పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్, పంచాయతీ కార్యదర్శి భూపతి, ప్రజలు పాల్గొన్నారు.

March 5, 2026 / 11:35 AM IST

కాండం తొలుచు పురుగు నివారణపై అవగాహన

SDPT: వరి పంటలను నష్టపరుస్తున్న కాండం తొలుచు పురుగు నివారణపై సిరిసిల్ల బాలు జర్మీనన్ రామ్ అగ్రికల్చరల్ కళాశాల విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించారు. ఇవాళ సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్‌లో క్షేత్రస్థాయిలో వరి పంటలను పరిశీలించారు. అధిక నత్రజని ఎరువుల వినియోగాన్ని నివారించి క్రమం తప్పకుండా పొలాలను పరిశీలించి పురుగు ఉద్ధృతిని తగ్గించుకోవడానికి గల సలహాలు, సూచనలు చేశారు.

March 5, 2026 / 11:32 AM IST