• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర: ప్రభుత్వ విప్

KNR: తమ పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి మద్దతు ధర పొందాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ. 2,389, సాధారణ రకానికి రూ. 2,369 గా నిర్ణయించిందని, రైతులు తమ సమీపంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వడ్ల అమ్మాలని సూచించారు.

April 20, 2026 / 09:26 AM IST

నర్వలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం

NRPT: నర్వ మండలంలో సోమవారం వడ్లు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు చెన్నయ్య సాగర్ తెలిపారు. ఉదయం 11 గంటలకు నర్వలో ప్రారంభించి పాతర్చేడ్, ఉందెకోడ్, కన్మనూర్ గ్రామాల్లో కొనసాగుతాయని చెప్పారు. రైతులు, అధికారులు పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

April 20, 2026 / 09:24 AM IST

దశదినకర్మకు హాజరైన మాజీమంత్రి ఎర్రబెల్లి

హన్మకొండ రెడ్డి కాలనీలోని మాజీ కార్పొరేటర్ వీరగంటి రవీందర్ మాతృమూర్తి దశదిన కర్మకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలవేసిన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఎర్రబెల్లి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, BRS నేతలు పాల్గొన్నారు.

April 20, 2026 / 09:21 AM IST

విద్యుత్ కోతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

MNCL: జన్నారం మండలంలో అర్ధరాత్రి వేళ విద్యుత్ కోతలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జన్నారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒకవైపు లిప్ పగటివేళ 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

April 20, 2026 / 09:20 AM IST

దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

NZB: నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

April 20, 2026 / 09:12 AM IST

అక్షరాల్లో రాయలేని ఒక మహా ప్రస్థానం

RR: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని షాద్ నగర్ పరిధిలోని ఉత్తర రామ లింగేశ్వర ఆలయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ అభిషేకాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. అక్షరాల్లో రాయలేని ఒక మహా ప్రస్థానం వారి జీవితం అన్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు.

April 20, 2026 / 09:11 AM IST

నేడు యాసంగి రెండో విడత రైతు భరోసా నిధుల విడుదల

SRPT: ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా యాసంగి రెండో విడత రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని నడిగూడెం రైతు వేదికలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మండల వ్యవసాయ అధికారి మల్సూరు కోరారు.

April 20, 2026 / 09:11 AM IST

నేడు రెండో విడత రైతు భరోసా నిధుల విడుదల

SRPT: ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా యాసంగి రెండో విడత రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని నడిగూడెం రైతు వేదికలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మండల వ్యవసాయ అధికారి మల్సూరు కోరారు.

April 20, 2026 / 09:11 AM IST

బల్మూరి వెంకట్ దంపతులు ఆశీర్వదించిన మంత్రి

MLG: HYDలో ఆదివారం రాత్రి MLC బల్మూరి వెంకట్ రిసెప్షన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ రిసెప్షన్ వేడుకలకు రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, NSUI నాయకులు తదితరులు ఉన్నారు.

April 20, 2026 / 09:07 AM IST

నేడు జిల్లెల్లలో ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్

SRCL: నేడు మధ్యాహ్నం 2:30 గంటలకు జిల్లెల్ల రైతు వేదికలో ‘రైతు నేస్తం’ ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని ఏఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. భూసార పరీక్షలు, అగ్రి స్టాక్‌పై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారన్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి 2వ దశ ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేసే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా వీక్షించవచ్చని, కావున రైతులు, ప్రజాప్రతినిధులు తప్పక హాజరుకావాలని ఏఈఓ కో...

April 20, 2026 / 09:07 AM IST

రైతులు రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి: ఏవో

BDK: ఆళ్లపల్లి మండలంలోని రైతులందరూ త్వరితగతిన రైతు రిజిస్ట్రీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని వ్యవసాయ అధికారి (ఏవో) కుమార్ రాజా సూచించారు. యూరియా బుకింగ్, పంటల కొనుగోలు కూడా దీనిపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. దీనిని రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలతో అనుసంధానించామని రిజిస్ట్రీ చేసుకున్న వారికే ఆర్థిక సాయం అందుతుందని స్పష్టం చేశారు.

April 20, 2026 / 09:06 AM IST

ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు

NLG: కనగల్ మండలం ధర్వేశిపురం పర్వతగిరి గ్రామాల శివారులో గల శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారు ఇవాళ ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు కుంకుమార్చనలు చేశారు.

April 20, 2026 / 09:06 AM IST

స్వయం సహాయక సంఘాలకు రుణాల అందజేత

JGL: పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో DAY-NRLM నిధుల ద్వారా స్వయం సహాయక సంఘాలకు ఆదివారం రుణాలు అందజేశారు. గొర్రె పొట్టేలు పిల్లల పెంపకం లబ్ధిదారులకు (2) యూనిట్లకు రూ. 2-00 లక్షల చొప్పున మొత్తం రూ.4 లక్షల విలువగల చెక్కులను AMC ఛైర్మన్ బుర్ర రాములు గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రవివర్మ పాల్గొన్నారు.

April 20, 2026 / 09:06 AM IST

నేడు తేజ మిర్చి ధర ఎంత అంటే..?

వరంగల్ పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల సాధారణ సెలవుల అనంతరం సోమవారం పున:ప్రారంభమయ్యింది. నేడు క్వింటాల్ తేజ మిర్చి ధర రూ.21,100 పలికినట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులు తెలిపారు. నేడు మార్కెట్లో తేజ మిర్చి క్రియ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులు తెలిపారు.

April 20, 2026 / 09:01 AM IST

రోడ్డు వేయాలని ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న ఫీల్డ్ అసిస్టెంట్

MHBD: నెల్లికుదురు మండలంలోని కాచికల్, మేచరాజుపల్లి గ్రామాల వరకు రోడ్డు వేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ వంగాల సోమయ్య ఎమ్మెల్యే మురళి నాయక్ కాళ్లు పట్టుకొని వేడుకున్నాడు. రోడ్డు పరిస్థితిని వివరించి తారురోడ్డు పునరుద్ధరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే తారు రోడ్డు మంజూరు చేయించి, పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

April 20, 2026 / 08:49 AM IST