SRD: బీజేపీ పాలనతోనే సమగ్ర గ్రామాభివృద్ధి జరుగుతుందని ఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి అన్నారు. శనివారం కంగ్టి మండలం ముర్కుంజాల్ గ్రామానికి ఆయన సందర్శించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు, తెలంగాణ రాష్ట్రంలో సక్రమంగా అన్ని గ్రామాలకు మళ్లించడం లేదని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు.
SRPT: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. నూతనకల్ మండలం లింగంపల్లిలో కాంగ్రెస్ నాయకులు చేతిలో ఇటీవల హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
BHPL: రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికైన జమలాపురం మోహన్ రావు, వార్డు సభ్యులు శనివారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గండ్ర వారికి శాలువా కప్పి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. BRS కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
PDPL: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలవడం పట్ల కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ప్రజల విజయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వమని, ప్రజా ప్రభుత్వంలో ఇది ప్రజల విజయమని తెలిపారు.
MBNR: గ్రామాల అభివృద్ధికి తాను పూర్తి సహకారం అందిస్తానని, సర్పంచ్‌లు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సూచించారు. నూతనంగా ఎన్నికైనా గాజులపేట సర్పంచ్ పద్మ శేఖర్, ఇప్పలపల్లి సర్పంచ్ ఆశమ్మ, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లను శనివారం ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
WGL: నల్లబెల్లి మండలం మెడిపల్లి గ్రామంలో అనుమతి లేకుండా మద్యం అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఇవాళ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన మార్గం రమేష్ ఇంట్లో తనిఖీలు చేపట్టి వివిధ బ్రాండ్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ. 40,140 విలువైన మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు.
WGL: MGM ఆస్పత్రిలో ఎలుకలు మరోసారి సంచలనం రేపాయి. ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్‌లో కాలు తొలగింపు సర్జరీ చేసుకున్న రోగికి ఎలుక కరవడంతో ఆసుపత్రి వాతావరణం ఉద్రిక్తమైంది. రోగి బంధువులు సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. అప్రమత్తమైన సిబ్బంది టీటీ ఇంజెక్షన్ వేశారు. అయినా ఇన్‌పెక్షన్ ప్రమాదం ఉందని భావించి రోగిని ఇంటికి పంపే ప్రయత్నం చేస్తున్నారని బంధువులు ఆరోపించారు.
NZB: భీంగల్ మండలంలో ఈరోజు జరిగిన నవోదయ పరీక్షలలో మండలంలోని ZPHS, కృష్ణవేణి టాలెంట్ విద్యాలయంలో నేడు 2025-26 విద్యా సంవత్సరానికి గానూ పరీక్షలు నిర్వహించారు. భీంగల్ ZPHS పరీక్ష కేంద్రంలో 144 మంది విద్యార్థులకు 127 మంది, కేటీఎస్ పరీక్ష కేంద్రంలో 150 మంది విద్యార్థులకు 137 మంది పరీక్ష రాయడానికి విద్యార్థులు హాజరైనట్లు ఎంఈఓ స్వామి తెలిపారు.
NLG: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే నాయకులను సర్పంచ్ ఎన్నికలలో ఎన్నుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐఎం పార్టీ అభ్యర్థులు నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తున్నారని అని అన్నారు.
SRD: కోహీర్ మండలం ఖానాపూర్ గ్రామానికి శనివారం సాయంత్రం పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. ఈ మేరకు ప్రిసైడింగ్ అధికారులు స్థానిక పోలింగ్ బూతుల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పోలింగ్ సామాగ్రి, బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, తదితర పోలింగ్ సామాగ్రిని బూత్‌లలో సిద్ధం చేసుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బందులు కలకుండా చర్యలు తీసుకున్నారు.
MHBD: జిల్లాలో రేపు జరగనున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ భద్రత చర్యలను చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. ఎన్నికల కోసం ఐదుగురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, 50 ఎస్సైలు మొత్తం 1200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు.
కరీంనగర్: మానకొండూర్ నియోజకవర్గం పరిధిలోని శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి దండు కొమురయ్యపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేశారు. గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లి వస్తున్న క్రమంలో కారం పొడితో దాడి చేశారు. దీంతో దండు కొమురయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
SRD: డిసెంబర్ 15న ఫ్లాగ్ డే జయప్రదం జయప్రదం చేయాలని సీఐటీయూ ఉపాధ్యక్షులు, కీర్బీ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాణిక్ అన్నారు. కీర్బీ CITU యూనియన్ కమిటీ సమావేశం నేడు పాశమైలారంలో జరిగింది. కేంద్రం తెచ్చిన శ్రమశక్తి నీతిని కార్మికులు ఐక్యంగా తిప్పికొట్టాలన్నారు. 4 లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి ఉరి తాళ్లు అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
WGL: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం వరంగల్, హన్మకొండ,జనగామ జిల్లాల్లో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు శనివారం పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ తెలిపారు. రేపు రెండో విడత ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్‌ఎస్ ఎస్‌సీఆర్‌పీసీ 163 (144 సెక్షన్) ప్రకారం ఐదుగురికి మించి గుంపులుగా చేరడాన్ని నిషేధించాం.
SRPT: మోతే మండల పరిధిలోని సర్వారం గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా మూడ్ నగేష్ ప్రచారానికి చివరి రోజు కావడంతో సర్వారం గ్రామంలో శనివారం ఇంటింటి ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ ప్రచారంలో మూడ్ నగేష్ మాట్లాడుతూ.. ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు.