వరంగల్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటల వరకు మొత్తం 59.11 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.
MLG: మల్లంపల్లి మండలం భూపాల్నగర్ పోలింగ్ కేంద్రంలో దివ్యాంగులు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రంలో వారి కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెద్దబోయిన శ్రీనివాస్, దివ్యాంగులు ఓటు వేయడానికి సహకరించారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసినందుకు ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
KNR: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఆయన సతీమణితో కలిసి సొంత గ్రామం పచ్చునూరులో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్ అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిపిస్తున్నారని పేర్కొన్నారు.
RR: కొత్తపేట డివిజన్ పరిధిలోని గాయత్రిపురం, నాగేశ్వరరావు కాలనీలో కొనసాగుతున్న స్ట్రామ్ వాటర్ పైప్‌లైన్ పనులను కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అధికారులు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు.
NLG: జిల్లా లో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 11 గంటల వరకు 56.44 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మెదక్ జిల్లాలో రెండో విడత పోలింగ్ సందర్భంగా 11 గంటల వరకు 59.26% పోలింగ్ నమోదైంది. మండల కేంద్రాలతో పాటు మేజర్ గ్రామపంచాయతీల్లో ఓట్ల పండుగ మాదిరిగా కనిపిస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు సైతం తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. 9 గంటల తర్వాత ఓటర్ల రాక బాగా పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
NZB: ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల (బాలికల) కళాశాల వసతి గృహం ఆవరణలో ఆదివారం “స్వచ్ఛ ఆర్మూర్” కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు, కాలనీవాసులు స్వచ్ఛందంగా శ్రమదానం చేసినట్లు చెప్పారు. విద్యార్థినులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని చెప్పుకొచ్చారు.
BDK: రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఇవాళ రొంపెడు గ్రామపంచాయతీలో BRS పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పార్వతీ శంకర్‌ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం చేసి కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. మారుమూల ప్రాంతానికి వారి హయాంలో రోడ్లు వచ్చాయన్నారు.
SDPT: బెజ్జంకి మండలానికి గ్రామ చెందిన పలువురు వలసదారులు గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి స్వగ్రామానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బెజ్జంకికి చెందిన రంజిత్ స్వీడన్ నుంచి రావాల్సిన గడువుకు నెల ముందే వచ్చి ఓటేశారు. అలాగే శానగొండ కిషన్ కువైట్ నుంచి రెండు నెలల ముందే వచ్చి ఓటు హక్కు వినియోగించారు.
RR: శంకర్‌పల్లి మండల పరిధిలోని 22 గ్రామాలలో ఉదయం 11 గంటల వరకు 53% పోలింగ్ నమోదు అయినట్లు ఎంపీడీవో వెంకయ్య గౌడ్ తెలిపారు. 34,700 మంది ఓటర్లకు గాను, పురుషులు, మహిళలు, వృద్ధులు కలిపి 18,439 మంది ఓటర్లు ఓటు వేశారని పేర్కొన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. మరో గంటలో ఓటింగ్ శాతం ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని తెలియజేశారు.
HNK: వేలేరు మండల కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్, మండల పరిషత్ సెకండరీ పాఠశాలలో గల పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఓటర్ల కోసం కల్పించిన సౌకర్యాలు, భద్రతా చర్యలు, ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు.
SRD: సంగారెడ్డి జిల్లాలోని 10 మండలాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆదివారం ఉదయం 11 గంటల వరకు 59.87% పోలింగ్ నమోదయిందని కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం తెలిపారు. మొత్తం 2,99,578 మంది ఓటర్లకు గాను 1,79,364 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.
SRPT: మునగాల మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన వృద్ధురాలికి పోలీసులు చేయూతనిచ్చారు. వీల్ చైర్ పై పోలింగ్ బూత్ కు వచ్చిన ఆమెను తీసుకెళ్లి ఓటు వేసేలా సహాయం చేసి తమ స్నేహభావాన్ని చాటుకున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది వివరించారు.
KNR: రెండో విడత మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 11 వరకు నమోదైన పోలింగ్ శాత వివరాలు ఇలా ఉన్నాయి. చిగురుమామిడి 61.61 గన్నేరువరం 61.61 మానకొండూరు 54.36 శంకరపట్నం 56.60 తిమ్మాపూర్ 52.57 నమోదైనట్టు తెలిపారు. మొత్తం 185003 ఓటర్లకు గాను 41502 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాలు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం గ్రామంలోని గ్రామ దేవతలకు కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం చేపట్టారు. కళ్యాణోత్సవాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ముందుగా గ్రామదేవతలకు ప్రసన్నం చేసుకున్నారు.