BDK: దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్ల సమీక్ష సమావేశం ఇవాళ జరిగింది. ఇటీవల నియమితులైన 184 మంది బూత్ ఏజెంట్లకు పార్టీ నూతన విధి విధానాల అమలు బాధ్యతల పై ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో DCC అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, చీకటి కార్తీక్ పాల్గొన్నారు.
NZB: ఎల్లంపేట శివారులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మాచారెడ్డి రేంజ్ పరిధిలో అడవి ప్రాంతంలో పులి అడుగుజాడలు గుర్తించినట్లు అటవీ అధికారులు తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామస్థులు రాత్రి సమయంలో బయటకు వెళ్లకూడదని, పశువులను సురక్షితంగా కాపాడుకోవాలని హెచ్చరించారు. అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.
ASF: రెబ్బెన మండలంలోని అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హరిత, సెంట్రల్ ప్రభారీ అధికారి రజత్ కుమార్ సైనితో కలిసి సందర్శించారు. చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, పిల్లల హాజరు శాతం, వంటగది నిర్వహణ, రికార్డులను తనిఖీ చేశారు. భవిత కేంద్రాలు, పిల్లల ఎత్తు, బరువులు పరిశీలించి, నాణ్యమైన విద్య, ఆటపాటలు అందించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
KNR: ఇల్లందకుంట మండలం సీతంపేటలో అంగన్వాడీ భవనం పశువుల పాకగా మారింది. 2014లో మంజూరైన బడ్జెట్‌తో భవనం అసంపూర్తిగా నిర్మించి వదిలేశారు. ప్రస్తుతం రెండు అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలో ఒకే గదిలో నడవడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూరం కారణంగా తల్లిదండ్రులు పిల్లలను పంపడం లేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ADB: ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోలీస్ కమాండ్ సెంటర్‌లో 490 సీసీ కెమెరాలను SP అఖిల్ మహాజన్‌తో డీజీపీ ప్రారంభించారు. శాంతిభద్రతలో పరిరక్షణలో సీసీ కెమెరాల ఏర్పాటు కీలకమన్నారు. నేరస్తులు సీసీటీవీ కెమెరాలు ఉన్న ప్రదేశాలలో నేరాలను చేయడానికి భయపడతారని పేర్కొన్నారు.
SRCL: వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం అంగన్వాడీ కేంద్రంలో ప్రత్యేక ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ నెల 13 నుంచి 25వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. కొత్త కార్డుల నమోదుతో పాటు, పేరు మార్పులు, వేలిముద్రల అప్డేట్ వంటి సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
SDPT: కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేస్తోందని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతలు హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
NLG: అంగన్వాడీల్లో చదువుకునే చిన్నారుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి చిన్నారులకు ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను అమలు చేయనున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణవేణి సోమవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9 ప్రాజెక్టుల పరిధిలో 2093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని ఆమె వెల్లడించారు.
NLG: అంగన్వాడీల్లో చదువుకునే చిన్నారుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి చిన్నారులకు ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను అమలు చేయనున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణవేణి సోమవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9 ప్రాజెక్టుల పరిధిలో 2093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని ఆమె వెల్లడించారు.
HYD: ఆరెంజ్ ఆర్మీ అంటే SRH ఫాన్స్ మాత్రమే కాదు.. ప్రతిభ కనబరిచే ప్రతి క్రికెటర్‌ను అభిమానించే మనసులవి. మేము SRH అభిమానులమే కానీ.. రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్య వంశీ విధ్వంసం చూసేందుకైనా ఇవాళ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్లాలని అభిమానులు SM మీడియాలో పోస్టులు చేస్తున్నారు. నేడు సాయంత్రం 7:30 గంటలకు జరిగే SRH VS RR మ్యాచ్‌లో ఏం జరుగుతుందో!
MBNR: జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సల్కర్‌పేట 41.3, దేవరకద్ర 41.2, మహమ్మదాబాద్ 41.1 డిగ్రీలు నమోదయ్యాయి. వడ్డేమాన్ 41.0, అడ్డాకుల 40.8, పారుపల్లి, సిరి వెంకటపూర్ 40.5, నవాబుపేట, మహబూబ్‌నగర్ అర్బన్‌లో 40.1 డిగ్రీలు నమోదయ్యాయి.
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ రోడ్‌లో 40 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఛైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో, కౌన్సిలర్ దేవుని రంజిత్ పర్యవేక్షణలో జెసిబితో ఇళ్ల తొలగింపు చేపట్టారు. పట్టణ సుందరీకరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణే లక్ష్యంగా ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి.
BHNG: మోటకొండూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా ధాన్యం కొనుగోలు నిర్వహించడంతో పాటు, రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
NRPT: మరికల్‌లో ఈనెల 14న జరగనున్న అంబేద్కర్ శోభాయాత్రకు రావాలని మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు సూర్య మోహన్ రెడ్డిని అంబేద్కర్ యువజన సంఘం ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఆయన ఆశయాల సాధనలో భాగస్వాములు కావాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ గోప చెన్నయ్య, మాజీ సర్పంచ్ రామస్వామి పాల్గొన్నారు.
RR: ఫరూఖ్‌నగర్ మండలం దూసకల్ గ్రామంలో విషాదం నెలకొంది. ఇంటర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టులు తప్పాననే మనస్తాపంతో అభి యాదవ్ అనే విద్యార్థి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇతడు, ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే, ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా తల్లిదండ్రులు గోప్యంగా ఉంచారు.