ASF: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీస్ శాఖ ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాలు నిర్వహించింది. పోలీసు అధికారులు ప్రజలకు గోల్డెన్ అవర్, రాహ్-వీర్ పథకం, డయల్ 100, 112 సేవలపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికిత్స (First Aid) మరియు సీపీఆర్ (CPR) నిర్వహించే విధానాలను క్షేత్రస్థాయిలో వివరించారు.
ADB: అరైవ్ అలైవ్ వారోత్సవాలలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో నిర్వహించిన రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో SP అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించడంతో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చునన్నారు. వాహనాలు నడిపే సమయంలో సీటు బెల్ట్, హెల్మెట్ కచ్చితంగా వాడాలని SP సూచించారు.
VKB: వృత్తి పట్ల నిబద్ధతను చాటుకుంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పుర్సంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ రెడ్డి తన విద్యార్థుల అభ్యున్నతి కోసం తన ఒక నెల జీతం రూ. 31,040ను పాఠశాలకు విరాళంగా అందజేశారు. శుక్రవారం ఎంఈవో రామచందర్ సమక్షంలో ఈ మొత్తాన్ని బడి అభివృద్ధికి కేటాయించారు.
SDPT: జాతీయ స్థాయి ఎన్సీసీ క్యాంపులకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సునీత తెలిపారు. కరీంనగర్ లోని 9వ తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపికల్లో..కళాశాల క్యాడెట్లు శ్రీదేవి,అంజలి,అక్షయ,శివ తమ ప్రతిభను చాటి ఎంపికయ్యారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో సత్తా చాటిన విద్యార్థులను కళాశాల సిబ్బంది అభినందించారు.
KMR: తన సొంత వ్యవసాయ భూమిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులో ఇవాళ సాయంత్రం చోటుచేసుకుంది. దోమకొండ మండలం చింతమాన్ పల్లి గ్రామానికి చెందిన శివాయిపల్లి లింగవ్వకు కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులో వ్యవసాయ భూమి ఉంది. ఎప్పటిలాగే వ్యవసాయ భూమి వద్దకు వచ్చిన లింగవ్వ అదే భూమిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
WNP: జిల్లాలోనే ప్రతి విద్యార్థి రోడ్డు భద్రత ప్రాముఖ్యతను తెలియజేస్తూ కలెక్టర్ స్వయంగా సందేశం తో కూడిన లేఖను రాశారు. ఈ లేఖలో విద్యార్థుల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడంతో పాటు బాధ్యత యుతమైన ప్రవర్తనను అలవర్చుకునేలా ప్రేరణ ఇస్తాయని తెలిపారు. ప్రతి విద్యార్థికి ఈ సందేశ లేఖ చేరాలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
KMR: లింగాపూర్ గ్రామానికి చెందిన మహిళ ఇవాళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఇంటినుంచి బయటకు వచ్చింది. పట్టణానికి వచ్చిన ఆమె రైల్వే ట్రాక్‌పై ఇద్దరు పిల్లలను తీసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లింది. దీనిని గమనించిన కానిస్టేబుల్స్ రామకృష్ణ, నర్సింలు ఆ ముగ్గురిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడారు.
KMM: ప్రతి విద్యార్థి చదివే నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉందని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ముదిగొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి విద్యార్థులతో మమేకమై వారి పఠన నైపుణ్యాలను పరిశీలించారు. విద్యార్థుల నైపుణ్యం చూసి ఆనందం వ్యక్తం చేశారు.
KMM: ప్రతి విద్యార్థి చదివే నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉందని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ముదిగొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి విద్యార్థులతో మమేకమై వారి పఠన నైపుణ్యాలను పరిశీలించారు. విద్యార్థుల నైపుణ్యం చూసి ఆనందం వ్యక్తం చేశారు.
WNP: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా స్థానిక మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు రోగులను క్షేమంగా బయటకు తరలించే విధానం, మంటలను అదుపు చేసే జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్టీఓ బంగారయ్య, ఫైర్ స్టేషన్ అధికారి నరసింహారెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
KNR: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో జరగనున్న PG, MBA, MCA 4వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. పరీక్షల నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ ప్రకారం, అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 27 వరకు, లేట్ ఫీజు రూ.300తో ఏప్రిల్ 29 వరకు చెల్లించవచ్చని తెలిపారు. జూన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
NZB: జిల్లాలో ఏప్రిల్ 18 ఉదయం 7 గంటలకు పోలీస్ కమిషనరేట్, సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌సీ, ఎన్‌పీఎల్-2026 స్పోర్ట్స్ మీట్ ర్యాలీ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు ఈ ర్యాలీ చేపట్టనున్నారు అని నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాలీనీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
KMR: వారం రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ ఇవాళ చేశారు. ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కామారెడ్డిలో నిర్వహించారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సభ్యులు పాల్గొని ఫీజు బకాయిలపై చర్చించారు.
ADB: అదిలాబాద్ ITDA ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలపై గిరిజన విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నియామకాలలో గిరిజనులకు అన్యాయం జరుగుతుందని వారు పేర్కొన్నారు. జీవో నెం.3 ప్రకారం స్థానిక గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
SRPT: మునగాల మండలం బరాకత్ గూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ఈరోజు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.