• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం: MLA

HNK: వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. 48, 49 డివిజన్ల పరిధిలో సుమారు రూ.9.37 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని, నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామని ఎమ్మెల్యే అన్నారు.

March 2, 2026 / 12:20 PM IST

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం

ASF: కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NSS ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్- 2026’ జిల్లా స్థాయి పోటీలు మార్చి 5న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ కే.శ్రీదేవి సోమవారం తెలిపారు.18 నుంచి 25 ఏళ్ల యువత ఇందులో పాల్గొనవచ్చన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు-భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు అంశంపై 3 నిమిషాల ప్రసంగం చేయాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

March 2, 2026 / 12:17 PM IST

భక్తులతో కిటకిటలాడిన ధర్మపురి క్షేత్రం

JGL: ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అనుబంధ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గోదావరి నదిలో వేలాది మంది భక్తులు స్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకున్నారు. భక్తులు తల పై కొబ్బరి, బెల్లాలు పెట్టుకుని వచ్చి స్వామి వారికి సమర్పించారు. భక్తులు శ్రద్దలతో పూజలు జరిపి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.

March 2, 2026 / 12:16 PM IST

ఎమ్మెల్సీ అంజిరెడ్డికి బీజేపీ నాయకుల వినతి

JGL: కోరుట్ల ప్రాంతానికి చెందిన బీజేపీ మల్లాపూర్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ చిన్నమలై అంజిరెడ్డిని హైదరాబాద్లో సోమవారం కలిశారు. మల్లాపూర్ మండలంలోని అనారోగ్య బాధితుల సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులు అందజేశారు. గొర్రెపెల్లి, గుండంపెల్లి, మొగిలిపేట్ పాఠశాలలకు గదులు, మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు కోరగా ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించారు.

March 2, 2026 / 12:14 PM IST

అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి

ADB: ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన బేల మండలంలో చోటుచేసుకుంది. సోమవారం మండలంలోని వరూర్ గ్రామంలో తన వ్యవసాయ భూమిలో వెంకట్ రావు(60) మృతిచెంది కనిపించినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు పోలీసుకు తెలపడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలియజేశారు.

March 2, 2026 / 12:14 PM IST

విద్యార్థులను అభినందించిన పాఠశాల HM

BHPL: గత నెలలో నిర్వహించిన TCC లోయర్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్షల్లో మహదేవపూర్ ZPHS ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఏడుగురు విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా సోమవారం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభినందించారు. చదువుతో పాటు కళాత్మక రంగాల్లో రాణించడం అభినందనీయమని పేర్కొన్నారు.

March 2, 2026 / 12:13 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు..!

PDPL: గోదావరిఖని డిపో నుంచి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక పుణ్యక్షేత్రాల యాత్రను ఈనెల 8న ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, కాంచీపురం, జోగులాంబ దర్శనాలు కల్పిస్తారు. 15న తిరుగు ప్రయాణం. టికెట్ ధర రూ.10,000. వివరాలకు 7382847596ను సంప్రదించాలని సూచించారు.

March 2, 2026 / 12:11 PM IST

గోడ కూలి.. ఓ వ్యక్తి తీవ్ర గాయాలు

MNCL: పాత గోడ కూలి వ్యక్తి గాయపడిన సంఘటన లక్షెట్టిపేట మండలంలోని పోతపల్లిలో జరిగిందని 108 టెక్నీషియన్ మునిందర్ గౌడ్ తెలిపారు. గ్రామానికి చెందిన నాయనాల రాజయ్య బుధవారం పశువుల కొట్టం ప్రహరీ గోడ వద్ద పనిచేస్తుండగా గోడ కూలిపోయింది. దీంతో రాజయ్య కాలుకు తీవ్ర గాయమైంది.108 సిబ్బంది టెక్నిషియన్ మునిందర్ గౌడ్, పైలట్ శ్రీనివాస్ చేరుకుని ఆస్పత్రికి తరలించారు.

March 2, 2026 / 12:10 PM IST

గద్వాల 14వ వార్డులో సమస్యల ఆవేదన

గద్వాల మున్సిపాలిటీలో 14వ వార్డు (గంజిపేట) సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని బీఆర్ఎస్ నేత రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వార్డులో పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా.. బాత్రూమ్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొని అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

March 2, 2026 / 12:09 PM IST

బాధిత కుటుంబానికి MLA అనిల్ జాదవ్ పరామర్శ

ADB: తలమడుగు మండలంలోని పల్సి (బి) తాండ గ్రామానికి చెందిన రాథోడ్ నరేందర్ భార్య అశ్విని ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బోథ్ MLA అనిల్ జాదవ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరి వెంట మండల BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 2, 2026 / 12:07 PM IST

అర్హులైన వారికి ఇళ్ల పత్రాలు పంపిణీ

BDK: మణుగూరు మండలానికి చెందిన 14 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు. పేదలకు గృహ వసతి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యంతో ఈ పథకం అమలవుతోందని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు లభించడం ద్వారా లబ్ధిదారుల కుటుంబాలకు స్థిర నివాసం కలగడంతో పాటు జీవన స్థితి మెరుగుపడుతుంది అని అన్నారు.

March 2, 2026 / 12:07 PM IST

బంజారా కాలనీలో లక్ష్మీ జయంతి వేడుకలు

KMM: మధిర బంజారా కాలనీలో గల శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం లక్ష్మీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజారులు ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు చేశారు. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పరిసరాలు భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

March 2, 2026 / 12:05 PM IST

చిన్న పెండ్యాలను దత్తత తీసుకున్నకేంద్ర మంత్రి

JN: చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామంలో ఇటీవల జరిగిన GP ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్‌గా గెలిచిన దివ్యాంగురాలు తిరుపతమ్మను ఇవాళ కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నపెండ్యాల గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో BJP రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెంకటేశ్వర్లు ఉన్నారు.

March 2, 2026 / 12:05 PM IST

రేపు పత్తి మార్కెట్‌కు సెలవు..!

KNR:హోళీ పండుగను పురస్కరించుకుని రేపు జమ్మికుంట మార్కెట్కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. ప్రభుత్వ సెలవు కారణంగా మంగళవారం మార్కెట్ కార్యకలాపాలు నిలిపివేయబడతాయని, తిరిగి బుధవారం నుంచి యథావిధిగా మార్కెట్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కావున రైతులు, వ్యాపారస్తులు, కార్మికులు ఈ విషయాన్ని గమనించగలరు.

March 2, 2026 / 12:03 PM IST

వరంగల్ మార్కెట్ లో మిర్చి ధరలు ఇలా..!

WGL పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ 2 రోజుల విరామం అనంతరం సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.21వేలు ధర పలకగా… వండర్ హాట్(WH) మిర్చి రూ.34 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.19,050, దీపిక మిర్చి రూ.29,500 కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

March 2, 2026 / 12:02 PM IST