GDWL: నేటితరం విద్యార్థినులు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం నడుం బిగించాలి అని ప్రిన్సిపాల్ డా. A. మీనాక్షి పిలుపునిచ్చారు. శుక్రవారం గద్వాలలోని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎన్ఎస్ఎస్ (NSS), ఎకో క్లబ్ ఆధ్వర్యంలో క్లీన్ & గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
WNP: జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి దామోదర రాజనర్సింహను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లాలోని పలు పరిపాలన, అభివృద్ధి అంశాలపై కలెక్టర్ మంత్రితో మాట్లాడారు.
MHBD: కేసముద్రం మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన వీరేష్ యాదవ్ను శుక్రవారం స్థానిక ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కౌన్సిలర్‌ను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. కౌన్సిలర్ మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధికి ఎల్లవేళల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రముఖులు, నేతలు తదితరులు ఉన్నారు.
KMM: ఉమ్మడి జిల్లాలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అమలుపై నిర్వహించిన కీలక సన్నాహక సమావేశానికి వైరా శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యచరణను వైరా నియోజకవర్గంలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
BHPL: గణపురం (M) చెల్పూర్ గ్రామానికి చెందిన నర్సయ్య ప్రతిష్ఠాత్మక ‘కొండా లక్ష్మణ్ బాపూజీ జాతీయ అవార్డు’కు ఎంపికయ్యారు. బహుజన సాహిత్య అకాడమీ (BSA) ఆధ్వర్యంలో ఈ నెల 15న తిరుపతిలో జరిగే కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు రాధాకృష్ణ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. పద్మశాలి సంఘం గ్రామ అధ్యక్షుడిగా నర్సయ్య అందిస్తున్న సేపులకు ఈ గుర్తింపు లభించింది
RR: షాద్‌నగర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమాన్ని MLA వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. పట్టణ అభివృద్ధి, ప్రజాసేవల మెరుగుదలే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు.
KNR: SRR ప్రభుత్వ కళాశాలలోని జంతుశాస్త్ర ఆధ్వర్యంలో మార్చి 30, 31 తేదీల్లో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించానన్నారు. దీనికి సంబంధించి కరపత్రాన్ని శుక్రవారం కళాశాల ఆవరణలో ప్రిన్సిపల్ రామకృష్ణ, అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, జీవవైద్య సంరక్షణ పైన జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించడం అభినందనీయమన్నారు.
ASF: ఆసిఫాబాద్ MPDO కార్యాలయంలో శుక్రవారం ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ ఫైళ్లను పరిశీలించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని MPDO ఆదేశించారు. అనంతరం కార్యాలయ పరిసరాలను సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అలసత్వం వహించవద్దన్నారు.
WGL: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతులను సన్మానించారు. అనంతరం నర్సంపేట నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కాసేపు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎర్రబెల్లి చర్చించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఖమ్మం హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఏజెంట్ల మధ్య మార్చి 4వ తేదీన జరిగిన గొడవలో టీ. చంద్రశేఖర్ (53) అనే పోస్టల్ ఏజెంట్‌పై తోటి ఏజెంట్లు దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడి ముఖానికి గాయాలవ్వగా, ఖమ్మం వన్ టౌన్ ఎస్సై రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడి నుంచి “ఆన్ సైట్” ఫిర్యాదును స్వీకరించారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
MBNR: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 3వ విడత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి దామోదర్ రాజానర్సింహా అధికారులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు పంతం చక్రపాణి, పంతం రవి కుటుంబ సభ్యులు రూ.1,05,000 ఆర్థిక సహాయం అందజేశారు. మొత్తం 21 మంది విద్యార్థులకు ఈ మొత్తాన్ని పంపిణీ చేశారు. మార్కండేయ దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్టకు రూ.51,000 విరాళం ఇచ్చారు. పేదలను ఆదుకునేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని చక్రపాణి అన్నారు. అనంతరం వారిని ఆ సంఘం సభ్యలు సన్మానించారు.
KMM: నేలకొండపల్లిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారును తప్పించబోయి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌లపై ప్రయాణిస్తున్న ఆరుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లో బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
WNP: అగ్ని ప్రమాదాలు వేసవి కాలంలోనే జరుగుతాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని వనపర్తి అగ్నిమాపక కేంద్రం అధికారి శ్రీనివాసులు సూచించారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ వనపర్తి ఆర్టీసీ డిపో వద్ద అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడు తూఅగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు 101, 102 నంబర్లను సంప్రదించాలన్నారు.
NZB: ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామం నుంచి రేకులపల్లి వెళ్లే రోడ్డు డైవర్షన్ రోడ్డు కింద రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఏడు లక్షల రూపాయలు మంజూరు చేశారు. శుక్రవారం డైవర్షన్ రోడ్డును ధర్పల్లి మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక సర్పంచ్ సరోజినీ దేవి, రేకులపల్లి సర్పంచ్ రాజేందర్ ఉన్నారు.