WNP: జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం, ప్రజల సాధారణ జీవనాన్ని నిరంతరాయంగా కొనసాగించడం, అనవసర గుమికూడింపులు నివారించడం లక్ష్యంగా మార్చి 31 వరకు 30 పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉంటుందని ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు భారీ స్థాయి సమావేశాలు నిర్వహించరాదన్నారు.
KNR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభమాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు జయంతిని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలోఅధికారికంగా ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ బస్టాండ్ చౌరస్తాలో గల శ్రీపాదరావు విగ్రహానికి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్,మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.
ASF: వాంకిడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్‌ను MLA కోవ లక్ష్మి సోమవారం ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తాయని, గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అనంతరం బ్యాట్ పట్టి బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ద్వారకపేట రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను సోమవారం మున్సిపల్ ఛైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వేసవికాలంలో పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న ఎన్, మాధవి ఫిమేల్ నర్సింగ్, బి, విజయ శానిటేషన్ స్వీపర్లకు ఫిబ్రవరి నెలకు సంబంధించి స్టార్ పెర్ఫార్మర్ అవార్డు ఇవ్వడం జరిగిందని DCHS డాక్టర్ శ్రీధర్ తెలిపారు. వారి విభాగాలలో ప్రత్యేక ప్రతిభ కనబరచినందుకు అవార్డులు ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో సూపరింటెండెంట్ డా. శ్రీధర్, RMO జమున, సిబ్బంది పాల్గొన్నారు.
WGL: నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామ సర్పంచ్ రమ్యతో పాటు ఆమె భర్తను కులం పేరుతో దూషించిన పాముల రాజేష్ అనే వ్యక్తిపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెక్కొండ ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
SRPT: ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులు రూ.151 చెల్లించి బుక్ చేసుకోవచ్చని డిపో మేనేజర్ సునీత ఇవాళ తెలిపారు. ఈ మేరకు గోడపత్రికను ఆవిష్కరించారు. ఏప్రిల్ 31 వరకు బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. వివరాలకు 9154298695 నంబర్లను సంప్రదించవచ్చని ఆమె సూచించారు.
MBNR: జడ్చర్ల మండల యూత్ కాంగ్రెస్ నాయకుడు నరసింహ యాదవ్ ఢిల్లీలో అరెస్ట్ కావడంపై యాదవ సంఘం నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఏఐ సమ్మేళనంలో అర్ధనగ్న ప్రదర్శన ద్వారా నిరసన తెలిపిన ఆయణ్ణు పోలీసులు అదుపులోకి తీసుకుని మూడు రోజులు గడుస్తున్నా, కాంగ్రెస్ అధిష్ఠానం పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. విడుదలకు చర్యలు వారు తీసుకోవాలన్నారు.
MBNR: మిడ్జిల్ మండలంలోని దోనూర్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ‘స్వయం పరిపాలన’ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, అధికారులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. హెడ్ మాస్టర్ తారాసింగ్ మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందిస్తాయని కొనియాడారు.
SRPT: తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా నేతలు డిమాండ్ చేశారు. సూర్యాపేట ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో నేతలు యాతాకుల రాజన్న, ఏపూరి రాజు మాట్లాడారు. రాజ్యసభ సీటు కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి పూర్తి బాధ్యత తీసుకోవాలని, తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వారు అన్నారు.
MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఎంపీడీవో గీతాంజలి ఆధ్వర్యంలో ఓరియంటేషన్ శిక్షణ నిర్వహించారు. పంచాయతీ చట్టం, నాయకత్వ లక్షణాలు, కార్యదర్శుల విధులపై అవగాహన కల్పించారు. గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 6లో 6.15 గుంటల భూమి ఎర్రగుంట ఉండేదని.. 2019లో కొందరు వెంచర్ యజమానులు రికార్డులను తారుమారు చేసి అనుమతులు పొందారని BC, SC, ST మండల జేఏసీ నాయకులు మధు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఎర్రగుంట భూమిని సర్వే చేసి అనుమతులు రద్దు చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులో నమోదు చేయాలన్నారు.
SDPT: భూంపల్లి-అక్బర్పేట్ మండలం ఖాజీపూర్‌లో శ్రీ మల్లన్న కళ్యాణ మహోత్సవం జరిగింది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ నిర్వాహకులను అభినందించి, గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
SRCL: కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో గతంలో కరెంట్ షాక్‌కు గురై మృతి చెందిన అనుమల మహేందర్ కుటుంబానికి సెస్ వైస్ ఛైర్మన్ దేవరకొండ తిరుపతి రూ.5 లక్షల ఎక్స్రేషియా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఏఈ, గ్రామ సర్పంచ్ కమ్మరి స్వప్న నాగరాజు పాల్గొన్నారు.