HNK: జిల్లాలోని చారిత్రక రామప్ప ఉపాలయాలైన శివ తారకేశ్వర స్వామి ఆలయం, గొల్లాల ఆలయాలను జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలుగా గుర్తించేందుకు భారత పురావస్తు శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. కాకతీయుల అద్భుత నిర్మాణ శైలికి ఈ రెండు ఆలయాలు ప్రత్యక్ష నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. ఈ నిర్ణయంపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ASIకు రాతపూర్వకంగా పంపాలన్నారు.
SRCL: ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి ఉదయం ప్రభుత్వ విప్ భూమి పూజ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఎన్నో ఆలయాలకు నిధులు మంజూరు చేసిందన్నారు.
MDK: మహిళలు విద్య, వైద్యం, రాజకీయాలు, పరిపాలన వంటి అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తున్నారని అల్లాదుర్గ్ CI రేణుక పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలపై జరిగే అణచివేతలు, వేధింపులను అరికట్టేందుకు పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు కృషి చేస్తుందని తెలిపారు. మహిళలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
HNK: పట్టణంలోని కాళోజి కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. మహిళా సాధికారతను ప్రోత్సహించేలా వివిధ స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రముఖుల స్ఫూర్తిదాయక సందేశాలు, చర్చలు జరగనున్నాయి. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, రాజకీయ ప్రతినిధులు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.
SRD: నవ్య రోడ్డు లో నిర్మిస్తున్న ముదిరాజ్ భవనం నిర్మాణ పనులను ఆదివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. త్వరితగతిన భవనం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. భవనం సమీపంలోనే నిర్మిస్తున్న ఆంజనేయస్వామి, అష్టలక్ష్మి దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్దేశించిన గడువులోగా దేవాలయ పనులు పూర్తి చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
JGL: మార్కెఫెడ్ ఆధ్వర్యంలో తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా రైతు ఐక్యవేదిక ప్రతినిధులు, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వరప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో 31 వేల ఎకరాల్లో సాగు చేసిన పంట ప్రస్తుతం చేతికి వచ్చిందని ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు రమేష్ రెడ్డి తెలిపారు. కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలన్నారు.
BDK: మణుగూరు మండలం చిన్నరావిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుంజా నాగేశ్వరరావు (55) ఆదివారం మృతి చెందారు. ఆయన మరణం పట్ల మణుగూరు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పికినారి నవీన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ పరంగా నాగేశ్వరరావు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ADB: నెరడిగొండ మండలంలోని నాయిడు గోడౌన్‌లో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకంపై రైతు శిక్షణ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు ఆర్గానిక్ విధానంలో పంటలు పండించాలని అవగాహన కల్పించేందుకే శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
MDCL: ఉప్పల్ సెవెన్ హిల్స్ కాలనీలో గార్బేజి రోడ్ల పై కుప్పలు తెప్పలుగా పడి ఉండటం గత 12 సంవత్సరాలుగా సాగుతోంది. ఇటీవలే స్మశాన వాటిక పక్కన నూతనంగా రోడ్డు నిర్మించారు. సెవెన్ హిల్స్ ఆర్చ్ సైతం నిర్మించారు. దీంతో కాలనీకి ఒక నూతన కల ఏర్పడింది. ఇకనైనా రోడ్లపై చెత్త వేయకుండా ఉండాలని కాలనీ ప్రెసిడెంట్ శ్రీధర్ కోరారు.
GDWL: గద్వాలకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు అరుణ్ కుమార్ మార్చి 15 నుంచి శ్రీలంకలో జరిగే సిరీస్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తొమ్మిదో వార్డు కౌన్సిలర్ రామలింగేశ్వర కాంళ్లే క్రీడాకారుడిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. HCA జిల్లా జట్టులో రాణించి ప్రతిభ చూపిన అరుణ్, గద్వాల ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపే అవకాశం పొందడం హర్షించదగ్గ విషయం.
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామ మహిళలందరికీ ఇవాళ సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా పోటుపడుతూ చదువు, ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లో ముందుకొస్తున్నారని గుర్తు చేశారు.
MLG: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా జిల్లా మహిళలకు బడే నాగజ్యోతి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. కుటుంబాన్ని, సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి మహిళలదేనన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి తమ లక్ష్యాలను సాధించాలని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతూ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారన్నారు.
ASF: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకంలో రాయితీ రుణాల ద్వారా ఆదాయ అభివృద్ధి జరుగుతుందని ఆసిఫాబాద్ DRDA దత్తారావు ప్రకటనలో తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు 35% రాయితీ, 65% బ్యాంకు రుణంతో పరిశ్రమలు స్థాపించుకోవచ్చన్నారు. 100 యూనిట్లు కేటాయించబడ్డాయని, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేయాలని సూచించారు.
SRPT: మునగాల మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ నాయనమ్మ సక్కుబాయమ్మ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.
MDCL: ఉప్పల్లో పైప్ లైన్ నిర్మాణాల కోసం సకల తిప్పలు పడాల్సిన పరిస్థితి. సాధారణంగా ముందస్తుగా చర్యలు చేపట్టి అధికారులు నిర్మాణాలు చేపడతారని, కానీ ఉప్పల్ యంత్రాంగం నిబంధనలకు విరుద్ధంగా, క్వాంటిటీ అంచనాలను తారుమారు చేస్తూ కాంట్రాక్టర్లకు ఊడిగం చేస్తున్నట్లుగా స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదంతా చూస్తున్నా ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.