• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మంత్రి తుమ్మలను కలిసిన ఎమ్మెల్యే యశస్విని

JN: సచివాలయంలో ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. తొర్రూరు, పాలకుర్తి, కొడకండ్ల మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాలను అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని, నియోజకవర్గంలో గోదాముల నిర్మాణం చేపట్టాలని మంత్రిని కోరారు.

March 7, 2026 / 01:00 PM IST

బీజేపీ మండల అధ్యక్షుడికి మండల సాధన సమితి సన్మానం

MLG: మల్లంపల్లి మండలం బీజేపీ నూతన అధ్యక్షుడు బైకాని మహేందర్‌‌ను మల్లంపల్లి మండల సాధన సమితి నాయకులు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహేందర్ నాయకత్వంలో పార్టీ మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల సాధన సమితి నాయకులు గోలుకొండ రాజు, మెరుగు రాజు, ఎండీ పాషా, తోటకూరి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

March 7, 2026 / 01:00 PM IST

నూతన విత్తన బిల్లును రద్దు చేయాలి: SKM

GDWL: గద్వాల మండల పరిధిలోని లత్తిపురం, బీరెల్లి గ్రామాల్లో సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఆధ్వర్యంలో శనివారం రైతులు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విత్తన బిల్లును, భారత్-అమెరికా వ్యవసాయ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య డిమాండ్ చేశారు. కేంద్రం రైతు వ్యతిరేక నిర్ణయాలు మానుకోవాలన్నారు.

March 7, 2026 / 01:00 PM IST

అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన

VKB: ఎండాకాలం దృష్ట్యా అగ్ని ప్రమాదాల నివారణపై పరిగి జడ్పీ హైస్కూల్లో అగ్నిమాపక శాఖ శనివారం అవగాహన సదస్సు నిర్వహించింది. మంటలు వ్యాపించినప్పుడు హడావుడి పడకుండా అప్రమత్తంగా ఎలా వ్యవహరించాలో సిబ్బంది విద్యార్థులకు వివరించారు. ప్రమాద సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ చర్యలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు.

March 7, 2026 / 12:55 PM IST

నియోనాటల్ 108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ

JGL: జిల్లా కేంద్రంలోని నియోనాటల్ 108 అంబులెన్స్‌ను శనివారం 108 జిల్లా మేనేజర్ ఐలయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. నవజాత శిశువులకు అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే నియోనాటల్ ఇంకూబేటర్, వెంటిలేటర్, సక్షన్ ఆపరేటర్, మల్టీఛానల్ మానిటర్, AEDతో పాటు ఇతర వైద్య పరికరాల పని తీరు, ఆక్సిజన్, మందులను, పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

March 7, 2026 / 12:55 PM IST

‘ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ విత్తనాలు’

WGL: రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ విత్తనాలు అందిస్తున్నట్టు నర్సంపేట డివిజన్ హార్టికల్చర్ అధికారి జ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె HIT TVతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ రైతుల అభివృద్ధి కోసం పలు సబ్సిడీ పథకాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. అర్హత కలిగిన రైతులు విత్తనాల కోసం వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

March 7, 2026 / 12:50 PM IST

వేం నరేందర్ రెడ్డితో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భేటీ

WGL: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ ఇవాళ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మహిళా కాంగ్రెస్ బలపేతానికి కష్టపడి పని చేయాలని ఎర్రబెల్లి స్వర్ణకు నరేందర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, తదితరులు పాల్గొన్నారు.

March 7, 2026 / 12:50 PM IST

వేధింపుల వల్లే ఆ విద్యార్థిని ఆత్మహత్య: పీడీఎస్‌యూ

BDK: దుమ్ముగూడెం మండలం రేగుపల్లి ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిని హెడ్మాస్టర్ వేధింపులకు గురి చేయడం వల్లే ఆత్మహత్య చేసుకుందని PDSU భద్రాద్రి జిల్లా కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్ అన్నారు. పిల్లల బాగోగులు చూడాల్సిన వారే ఇలా చేయడం దారుణమన్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

March 7, 2026 / 12:50 PM IST

చాకరిమెట్లకు పోటెత్తిన భక్తజనం

ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన శివంపేట మండలం చిన్నగొట్టిముక్ల అటవీ ప్రాంతంలోని చాకరిమెట్ల హనుమాన్ గుడిలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి అభిషేకం, అలంకరణ, ప్రత్యేక హారతులు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

March 7, 2026 / 12:49 PM IST

పారిశుధ్య పనులను వేగవంతం చేయాలి: కమిషనర్

KMM: ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ‘ప్రజా పాలన – 99 రోజుల ప్రణాళిక’లో భాగంగా 28, 35, 49 డివిజన్లలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. అక్కడ జరుగుతున్న పారిశుధ్యం, మౌలిక సదుపాయాల పనులను పరిశీలించారు. పారిశుధ్య పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు పౌర సేవలు ఎలాంటి ఆటంకం లేకుండా వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

March 7, 2026 / 12:49 PM IST

‘మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి’

MNCL: మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు.

March 7, 2026 / 12:47 PM IST

‘మార్చి 31లోపు ఇంటి పన్నులు చెల్లించండి’

GDWL: అలంపూర్ పురపాలక ప్రజలు 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులను మార్చి 31లోపు చెల్లించాలని కమిషనర్ ఎన్. శంకర్ కోరారు. శనివారం 3వ వార్డులో పన్నుల వసూలు కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు నారాయణ, ఆంజనేయులు, రమేశ్ నాయుడు పాల్గొన్నారు.

March 7, 2026 / 12:43 PM IST

రోడ్లను శుభ్ర పరిచిన ఎమ్మెల్యే

KNR: KNR మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ సదాశివపల్లిలో సీసీ రోడ్ల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా భూమిపూజ నిర్వహించారు. రోడ్లను శుభ్రం చేశారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.

March 7, 2026 / 12:42 PM IST

అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి

MLG: అర్హులైన పేదలకు ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క అన్నారు. మలుగు మున్సిపాలిటీ 5వ వార్డులో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 99 రోజులపాటు నిర్వహించే ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ములుగు ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని సీతక్క పిలుపునిచ్చారు.

March 7, 2026 / 12:40 PM IST

మధురానగర్‌లో కానిస్టేబుల్‌పై దాడి.. ముగ్గురు అరెస్ట్!

హైదారబాద్‌లోని మధురానగర్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్‌పై ఇటీవల దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులను సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

March 7, 2026 / 12:39 PM IST