MLG: మల్లంపల్లి మండలం బీజేపీ నూతన అధ్యక్షుడు బైకాని మహేందర్‌ను మల్లంపల్లి మండల సాధన సమితి నాయకులు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహేందర్ నాయకత్వంలో పార్టీ మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల సాధన సమితి నాయకులు గోలుకొండ రాజు, మెరుగు రాజు, ఎండీ పాషా, తోటకూరి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.