Outer Ring Road Sale For RS.1000 Crores:Revanth Reddy
Revanth on Outer Ring Road:ఔటర్ రింగ్ రోడ్ అమ్మకంలో కూడా స్కాం జరిగిందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఔటర్‌ను ఇప్పుడు ప్రైవేట్‌కు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మించామని రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. సిటీకి మణిహారంగా ఔటర్ నిర్మించామని పేర్కొన్నారు. ఆనాటి ప్రభుత్వం రూ.6696 కోట్ల పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రింగ్ రోడ్ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్మించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తున్నాయంటే గత ప్రభుత్వం నిర్మించిన విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ అని పేర్కొన్నారు.
ఔటర్ రింగ్ రోడ్‌ను మంత్రి కేటీఆర్ (ktr) ఫ్రెండ్స్ ఆదాయ వనరుగా వాడుకుంటున్నారని రేవంత్ (Revanth) ఆరోపించారు. గత 4 ఏళ్ల నుంచి టోల్‌ను ఈగల్ ఇన్ ఫ్రాకు కట్టబెట్టారని గుర్తుచేశారు. ఆదాయాన్ని శాశ్వతంగా తీసుకోవాలని ఆలోచించి.. 30 ఏళ్లు ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.
రూ.30 వేల కోట్ల ఆదాయం వచ్చే రింగ్ రోడ్‌ను రూ.7380 కోట్లకే ముంబై కంపెనీకి తాకట్టు పెట్టారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. దీని వెనక సోమేశ్ కుమార్ (Somesh kumar) ఉన్నాడని.. అరవింద్ కుమార్ (aravind kumar) సంతకం చేశారని ఆరోపించారు. ఈ నిర్ణయాలను వచ్చే ప్రభుత్వం సమీక్షిస్తోందని పేర్కొన్నారు. దేశంలో ఇది అతి పెద్ద కుంభకోణం అని చెప్పారు. కనీసం రూ.వెయ్యి కోట్లు చేతులు మారి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు.