Telangana government Has Declared of RS.5 Lakhs to Mounika Family
Mounika Family:హైదరాబాద్ కళాసిగూడ నాలాలో పడి చనిపోయిన బాలిక మౌనిక (mounika) కుటుంబాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav) పరామర్శించారు. ఆమె మృతి బాధాకరం అని వారితో అన్నారు. పాల ప్యాకెట్ (milk packet) తీసుకొచ్చేందుకు వెళ్తుండగా కిందపడ్డ సోదరుడిని కాపాడే ప్రయత్నంలో మౌనిక (mounika) నాలాలో పడిపోయిందని తలసాని తెలిపారు. మౌనిక (mounika) కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం అందజేస్తుందని వెల్లడించారు.
తెలంగాణ (telangana) ఏర్పడిన తర్వాత గ్రేటర్ పరిధిలో రూ.590 కోట్లతో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav) పేర్కొన్నారు. వర్షాలు పడితే ఎక్కడ వరద వస్తుందో.. అలాంటి నాలాలను (naala) ఈ నిధులతో బాగు చేస్తున్నామని తలసాని (talasani) తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాలను ఈ ప్రభుత్వం మోయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నాలాలపై చేపట్టిన నిర్మాణాల వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని తెలిపారు.
మౌనిక (mounika) కుటుంబానికి గ్రేటర్ మేయర్ విజయలక్ష్మీ రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. మున్సిపల్ అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఏఈ తిరుమలయ్య, వర్క్ ఇన్ స్పెక్టర్ హరికృష్ణను సస్పెండ్ చేశారు. ఘటనపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈఈని ఆదేశించింది.