Laxmi Parvathi:తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై (Rajinikanth) విమర్శల జడివాన కురుస్తోంది. చంద్రబాబును (chandrababu) చూసి ఎన్టీఆర్ (ntr) ఆత్మ సంతోషిస్తోందని కామెంట్ చేసి కొరివితో తలగోకినట్టు అయ్యింది. మంత్రి రోజా (roja), ఎమ్మెల్యే కొడాలి నాని (kodali nani).. ఇప్పుడు ఏపీ అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి (laxmi parvathi) వంతు వచ్చింది. ఆమె స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణీ అనే సంగతి తెలిసిందే. రజనీకాంత్ (Rajinikanth) మరోసారి ఎన్టీఆర్ గురించి మాట్లాడితే ఊరుకోబోనని తేల్చిచెప్పారు.
ఆ నాడు వెన్నుపోటు పొడిచిన సమయంలో చంద్రబాబు నాయుడుకు (chandrababu) అండగా నిలిచిన వారిలో రజనీకాంత్ (Rajinikanth) కూడా ఉన్నారని లక్ష్మీపార్వతి చెబుతున్నారు. తర్వాత ఎన్టీఆర్‌ను (ntr) కలిసి తప్పు చేశానని సారీ చెప్పారని గుర్తుచేశారు. వెన్నుపోటు వ్యవహారంలో రజనీకాంత్‌ను (Rajinikanth) తమిళ మీడియా విమర్శించిందని ఆమె తెలిపారు. చాలా రోజులు ఏపీ రాజకీయాలకు దూరంగా ఉన్నారని వివరించారు.
రజనీకాంత్‌ను (Rajinikanth) చంద్రబాబు (chandrababu) తెలివిగా వాడుకుంటున్నారని లక్ష్మీపార్వతి (laxmi parvathi) చెబుతున్నారు. రజనీ (rajini) ద్వారా బీజేపీకి దగ్గర కావాలని చంద్రబాబు ఎత్తుగడ వేవారని లక్ష్మీపార్వతి (laxmi parvathi) ఆరోపించారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి సర్వేలు అన్నీ జగన్‌కు (jagan) అనుకూలంగా ఉన్నాయని గుర్తుచేశారు. దీంతో చంద్రబాబు (chandrababu) సినిమా వారితో నాటకాటు ఆడిస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబుతో రజనీకాంత్ కూడా వెన్నుపోటుదారుడేనని లక్ష్మీపార్వతి (laxmi parvathi) అన్నారు. అతనికి నిజాయితీ ఉంటే ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఏం మాట్లాడారో తెలుసుకోవాలని కోరారు. రజనీ కామెంట్లకు విశ్వసనీయ ఉంటుందని తాను భావించడం లేదన్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడేందుకు చంద్రబాబు, రజనీకాంత్ ఎవరని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పుస్తకాలు ఆవిష్కరించినంత మాత్రాన రజనీకాంత్‌ను ఎవరు విశ్వసించరని లక్ష్మీపార్వతి అన్నారు.