»A Young Woman Who Marries A Farmer Gets Rs 5 Lakhs Appeal To Karnataka Govt
Viral News: రైతును పెళ్లి చేసుకునే యువతికి రూ. 5 లక్షలు.. ప్రభుత్వానికి విజ్ఞప్తి
వ్వవసాయం చేసే యువకులను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఆసక్తి చూపడం లేదని రైతు సంఘాలు వాపోతున్నాయి. సేద్యం చేసే అబ్బాయిలను మ్యారెజ్ చేసుకునే అమ్మాయిలకు రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వానికి వినతి పత్రం అందించారు.
A young woman who marries a farmer gets Rs. 5 lakhs.. Appeal to Karnataka Govt
Viral News: భారతదేశానికి వెన్నముక వ్యవసాయం కానీ వ్యయసాయం చేసే రైతులకు సాయం అందదు అని తెలుసు కానీ ఈ రాష్ట్రంలో పెళ్లిళ్లు కూడా అవడం లేదట. అగ్రికల్చర్ మీద ప్యాషన్‌తో చాలా మంది కార్పొరెట్ కంపనీలు వదిలి సేద్యం చేస్తున్నారు. అయితే వ్యవసాయం చేసే యువ రైతులను మ్యారెజ్ చేసుకోవడానికి అమ్మాయిలు ముందుకు రావడం లేదని కర్ణాటక రైతులు వాపోతున్నారు. 45 ఏళ్లు వచ్చినా రైతులకు వివాహాలు అవడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రైతు సంఘాల ప్రతినిధులు వినతిపత్రం అందించారు. యువ రైతులను పెళ్లి చేసుకొనే అమ్మాయిలకు రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. సోమవారం రైతు సంఘాలతో జరిగిని భేటీలో సీఎంకు యంగ్ ఫార్మర్స్ బాధను చెప్పారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోవు తరాలు వ్యవసాయం అంటేనే భయపడే పరిస్థితి నెలకొంటుందని చెప్పారు.
అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు ముందు సీఎం సిద్ధరామయ్య రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు. రైతు ప్రయోజనాల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చించారు. అలాగే వారి సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వ కేటాయింపులపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రైతు సంఘంలో పౌష్టికాహారం, నీటి వనరుల అభివృద్ధి పెంపుదలకు అవసరమైన నిధులను కేటాయించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అగ్రికల్చర్ చేస్తూ.. ఏటా లక్షలు ఆర్జిస్తున్నా కూడా యువ రైతులకు పెళ్లి కావడంలేదని సీఎం సిద్ధరామయ్యకు తెలిపారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.