Gold Rate Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
దేశీయ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
gold rate today hyderabad and vijayawada december 24th 2023
Gold And silver Rates : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.64,325 ఉండగా, సోమవారం నాటికి రూ.100 పెరిగి రూ.64,425కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.72,375 ఉండగా, సోమవారం రూ.225 పెరిగి రూ.72,600గా ఉంది.
దేశంలోని ప్రధాన పట్టణాల్లో బంగారం, వెండి ధరల్లో(Gold and silver rates) కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.64,425గా ఉంది. కిలో వెండి ధర రూ.72,600గా ఉంది. అలాగే విశాఖపట్నం, విజయవాడ, ప్రొద్దుటూరుల్లోనూ 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,425గా ఉంది. కిలో వెండి ధర రూ.72,600గానే ఉంది. సోమవారం ఉదయం మార్కెట్లు ప్రారంభం అయ్యే సమయంలో ఉన్న రేట్లు ఇవి. తర్వాత మళ్లీ ఇవి మారుతూ ఉంటాయి. కొనుగోలుదారులు గమనించుకుని కొనుగోళ్లు చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పులు లేవు. బంగారం రేటు(Gold Rate) మాత్రం స్వల్పంగా తగ్గింది. ఆదివారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2024 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 1 డాలర్ తగ్గి 2023 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఔన్సు వెండి ధర 22.68 డాలర్లుగా ఉంది.