»Bihar A Young Woman Threw Acid On A Young Man For Refusing To Marry
Viral News: ప్రేమించి.. పెళ్లనే సరికి నో.. గుణపాఠం చెప్పిన లవర్
పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువతి ప్రేమించిన యువకుడిపై యాసిడ్‌తో దాడి చేసింది. ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Bihar, a young woman threw acid on a young man for refusing to marry
Viral News: ప్రేమను అంగీకరించలేదని అమ్మాయిలపై యాసిడ్ దాడి(Acid attack) చేసిన ఘటనలు చూశాం. ఇలాంటి ఘటనలో బాధితులు అమ్మాయిలే. ఇప్పుడు కాలం మారింది. ఎందులోనూ తక్కువ కాదంటున్న కొందరు అమ్మాయిలు.. తమను కాదన్న వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రేమించకపోయినా, పెళ్లికి ఒప్పుకోకపోయినా అబ్బాయిలపై దాడి చేస్తున్నారు. ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.
బిహార్(Bihar)లోని వైశాలి జిల్లాలో ఈ దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడిపై యువతి యాసిడ్ పోసింది. దీంతో అతని ముఖం కాలిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. బాధితుడు ధర్మేంద్ర కుమార్‌గా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న స్థానికులు అతన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువతిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారిద్దరు గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ మధ్యే అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవల్సిందిగా అమ్మాయి అడిగింది. తన వయసు ఎక్కువని, ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని అబ్బాయి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది. ఈ ఘటనతో ధర్మేంద్రపై కోపం పెంచుకుంది. అతనితో మాట్లాడాలని చెప్పింది. అప్పటికే తనతో తెచ్చుకున్న యాసిడ్ మొహంపై పోసింది. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఇది కలికాలం.. తమతో తిరిగి, ఎంజాయ్ చేసి.. పెళ్లి చేసుకునే సమయానికి పక్కన పెడితే ఊరుకోవడం లేదు. గతంలో కొందరు ఊరుకున్నారెమో.. కానీ ఇప్పుడలా లేదు. చంపేందుకు అయినా వెనకాడటం లేదని ఈ ఘటన రుజువు చేసింది.