YS Sharmila అను నేను చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం పోరాడుతా
షర్మిల పార్టీ మార్పు గురించి పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో ఆమె స్పందిస్తూ.. పార్టీ మారడం లేదని, తన మీద దృష్టిసారించే బదులు.. సీఎం కేసీఆర్ అవినీతి మీద ఫోకస్ చేయాలని కోరారు.
YS Sharmila: వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల (YS Sharmila) పార్టీ మారతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. కాంగ్రెస్లో చేరతారని.. జూలై 8వ తేదీన సోనియా గాంధీ సమక్షంలో చేరడం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. ఇంతలో బెంగళూరులో డీకే శివకుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. వారి భేటీలో కూడా షర్మిల (YS Sharmila) గురించి చర్చ జరిగిందట. దీంతో షర్మిల స్పందిస్తూ.. తాను పార్టీ మారబోనని ఇండైరెక్టుగా చెప్పేశారు. తన గురించి అసత్య ప్రచారాలు మానుకోవాలని సుతి మెత్తగా హెచ్చరించారు.
వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటది. ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజలమధ్య అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయి. పనిలేని,పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే. నా రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని…
తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా కొనసాగుతానని షర్మిల (YS Sharmila) తేల్చిచెప్పారు. తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంటానని.. ఊహాజనిత కథలు కల్పిస్తూ, తనకు, తెలంగాణ ప్రజల మధ్య అగాధం సృష్టించేందుకు విఫల ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వీటిని నమ్మొద్దని ఆమె కోరారు. పనిలేని కొందరు ఇలాంటివి ప్రచారం చేస్తారని.. వాటికి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తన మీద పెట్టే దృష్టి, సమయాన్ని కేసీఆర్ పాలనపై పెట్టాలని షర్మిల కోరారు.
కేసీఆర్ హయాంలో రాష్ట్రం వెనకబాటునకు గురయ్యిందని తెలిపారు. తన మీద కన్నా రాష్ట్రం మీద, కేసీఆర్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని సూచించారు. కేసీఆర్ కుటుంబం చేసే అవినీతి కనిపించడం లేదా అని అడిగారు. వాటి మీద ప్రశ్నించాలని కోరారు. అంతే తప్ప నిరాధారంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. తన భవిష్యత్ తెలంగాణతోనే అని స్ఫష్టంచేశారు. తెలంగాణలో తన ఆరాటం, పోరాటం కొనసాగుతోందని తేల్చిచెప్పారు. తెలంగాణలో తన రాజకీయ జీవితం అని స్పష్టంచేశారు. పార్టీ మార్పు గురించి డైరెక్టుగా మాత్రం ప్రస్తావించలేదు.