ఖమ్మంలో జులై 2న జరిగే తెలంగాణ గర్జన (Telangana garjana) సభను విజయవంతం చేయాలని కార్యకర్తలు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభతో వచ్చే ఎన్నికల్లో గెలుపునకు నాంది పలకాలన్నారు. సభ ఏర్పాట్లపై సమీక్షలో మాట్లాడుతూ.. మాజీ ఎంపీ పొంగులేటి చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లా(Khammam District)లో పార్టీ బలపడుతుంది. ఇక్కడ పదికి పది స్థానాలు గెలవాలి. గ్రూపు రాజకీయాలు లేకుండా కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి’ అని రేవంత్ సూచించారు. ఖమ్మంలో సభ ఏర్పాటు చేసినప్పుడు వచ్చిన ప్రజల కంటే ఎక్కువమందినే తీసుకుని వస్తారని, తమ సభ కంటే ఎక్కువ మంది కదం తొక్కుతారని రేవంత్ అన్నారు. ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), రేణుకా చౌదరి రెండు కళ్ళు .. తమ మూడో కన్ను శ్రీనివాస రెడ్డి అని రేవంత్ చెప్పారు.
శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో అందరికీ తెలుసని, అలానే శ్రీనివాస రెడ్డి తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీనీ పాతాళానికి తొక్కుతారని, సోనియా గాంధీ (Sonia Gandhi) పుట్టిన రోజు నాటికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రములో అధికారంలోకి వస్తుందన్నారు.తెలంగాణ ఉద్యమం అంతా కేసీఆర్ వెనకాల నిలబడినా 2014 తర్వాత మాత్రం ఆయన్ను ప్రజలు ఆశీర్వదించి అధికారం కట్టబెట్టారని మండిపడ్డారు. ఖమ్మంలో 10కి 10 గెలిపించండి రాష్ట్రంలో అధికారంలోకి ఎందుకు రాదో నేను చూస్కుంటానని ఆయన తెలిపారు. ఢిల్లీలోని జాతీయ మీడియా మొత్తం ఖమ్మంకు వస్తుందన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) కండువా కప్పుకుంటే ఖమ్మం గడ్డ మీదనే కప్పుకుంటానని చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు.