»Mothers Milk Is Like Nectar For The Child Kishan Reddy
Kishan Reddy : తల్లి పాలు బిడ్డకు అమృతం లాంటివి : కిషన్ రెడ్డి
హైదరాబాద్ (Hyderabad) సనత్‌నగర్‌లో జరిగిన హెల్తీ బేబీ (Healthy baby) కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. తల్లి పాలు బిడ్డకు అమృతం లాంటివని కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. దేశంలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాలలో మూడు నెలలు నుండి 13 నెలల పసిపిల్లల కోసం హెల్తీ బేబీ కార్యక్రమం నిర్వహించాలని ప్రధాని మోదీ (Prime Minister Modi) ఆదేశించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్ (Hyderabad) సనత్‌నగర్‌లో జరిగిన హెల్తీ బేబీ (Healthy baby) కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. తల్లి పాలు బిడ్డకు అమృతం లాంటివని కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. దేశంలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాలలో మూడు నెలలు నుండి 13 నెలల పసిపిల్లల కోసం హెల్తీ బేబీ కార్యక్రమం నిర్వహించాలని ప్రధాని మోదీ (Prime Minister Modi) ఆదేశించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. కొందరు తల్లులు పిల్లలకు డబ్బా పాలు ఇస్తారని.. అయితే తల్లి పాలే మంచిదన్నారు. తల్లిపాల వల్ల రోగనిరోధక శక్తి.. 3 నుంచి 13 నెలల పసి పిల్లలతో హెల్తీ బేబీ షో నిర్వహిస్తున్నారన్నారు. పిల్లలను తల్లులు ఎంతో పోటీ తత్వంతో పెంచుతున్నారన్న కిషన్ రెడ్డి.. ఇది చాలా మంచి పరిణామమన్నారు. తల్లి పాల వల్ల పిల్లలు పెద్ద అయ్యాక కూడా రోగ నిరోధక శక్తి (Immunity) వల్ల ఆరోగ్యంగా ఉంటారన్నారు.
ప్రభుత్వం, సమాజం తరఫున తల్లిపాలను ప్రోత్సహించడానికే ఈ కార్యక్రమం తీసుకొచ్చామన్నారు కిషన్ రెడ్డి. హెల్తీ బేబీ షో సర్టిఫికెట్ (Healthy Baby Show Certificate) పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా గుర్తుగా ఉంటుందన్నారు. అక్కడికి వచ్చిన చిన్నారులతో ఫొటోలు దిగారు. చిన్నపిల్లల ఆరోగ్యం.. తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తల్లులకు హెల్తీ బేబీ షో సర్టిఫికెట్, ఫొటో ఫ్రేమ్, కిట్‌ను కూడా కిషన్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, అమీర్‌పేట్ కార్పొరేటర్ కేతినేని సరళ, జిల్లా డీఎంహెచ్ఓ అధికారులు, ఆశ వర్కర్లు, పాల్గొన్నారు.
Felicitated children & their families and distributed Poshan Kits. Poshan kits are curated keeping in mind the adequate nourishment and balanced diet required for the growth of toddlers. pic.twitter.com/xDK4lwRy3A