JN: తండ్రి చనిపోయిన దుఃఖంలోనే పది పరీక్ష రాసిన సంఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండకి చెందిన సాంబయ్య (47) 10ఏళ్లుగా కుటుంబంతో కలిసి స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉంటున్నాడు. అనారోగ్యానికి గురైన సాంబయ్య నిన్న రాత్రి మృతి చెందగా, మృతదేహాన్ని తాటికొండకు తరలించారు. పదో తరగతి చదువుతున్న అతని కుమారుడు చరణ్.. తండ్రి మృతి చెందిన దుఃఖంలోనే పరీక్ష రాశాడు.