ktr fired on revanth:పదిసార్లు ఛాన్స్ ఇస్తే ఏం చేశారు..రేవంత్: కేటీఆర్
ktr fired on revanth:తెలంగాణ రాష్ట్రంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. ఎన్నికల సమయం దగ్గర పడుతోన్న వేళ.. ప్రజలతో ఉంటున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ భూపాలపల్లి జిల్లాలో అభివృద్ది పనులకు శంకు స్థాపన చేశారు. రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఊరికే విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు.

తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని రేవంత్ రెడ్డా అడుగుతున్నారు.. గత 75 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పది చాన్సులు ఇచ్చారు కదా అని గుర్తుచేశారు. అప్పుడు చేయనిది.. ఇప్పుడు మళ్లీ అవకాశం ఇవ్వాలా? అడిగారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో జనాలకు తెలుసు అని స్పష్టం చేశారు. మళ్లీ ఆ దిక్కుమాలిన పాలన కావాలా అని ఒకింత ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 ఎమ్మెల్యేలు రాజ్యాంగానికి లోబడే టీఆర్ఎస్ పార్టీలో చేరారని కేటీఆర్ పేర్కొన్నారు. మరీ ఆనాడు వారిని ఎందుకు అడ్డుకోలేదు అని అడిగారు. ఇటుకలతో కొడతామని కామెంట్ చేయడం మంచి పద్దతి కాదన్నారు. తమ పార్టీకి చెందిన కార్యకర్తలు బండరాళ్లతో కొట్టేందుకు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను.. కర్ణాటకలో అమలు చేయాలని కోరుతున్నారని కేటీఆర్ తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలు స్వయంగా అడిగారని చెప్పారు. లేదంటే తమ నియోజకవర్గాలను తెలంగాణ రాష్ట్రంలో కలుపాలని కోరుతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు.. కేంద్ర ప్రభుత్వానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. రైతుబంధు పథకం స్ఫూర్తితోనే కిసాన్ సస్మాన్ యోజన స్కీం అమలు చేశారని తెలిపారు. ఇలా చాలా పథకాలు ఉన్నాయని చెప్పారు.