Minister KTR: టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ (revanth) ఏ రోజైనా ప్రధాని మోడీ, బీజేపీని విమర్శించారా అని అడిగారు. ఓ ఎంపీ అయి ఉండి.. ప్రధానమంత్రిని నిలదీయరా అని అడిగారు. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ చూపిస్తోన్న పక్షపాత ధోరణిని ఎందుకు నిలదీయరని అడిగారు. ఈ రోజు తెలంగాణ భవన్లో మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీజేపీ ఏజెంట్ రేవంత్ రెడ్డి (revanth) అని మంత్రి కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని.. గాంధీభవన్‌లో గాడ్సే దూరాడని తెలిపారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవీ చేపట్టి 8 నెలలు అవుతుంది.. ఇప్పటివరకు ఎందుకు బీజేపీ తప్పదాలను విమర్శించడం లేదని నిలదీశారు. ఊ అంటే సీఎం కేసీఆర్ (cm kcr) మీద విమర్శలు చేస్తారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి.. మంత్రుల మీద విమర్శలు చేస్తారని.. మరీ మోడీ, బీజేపీ (bjp) ప్రభుత్వ విధానాలను ఎందుకు విమర్శించరని అడిగారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఎందుకు నోరు మెదపరు అని అడిగారు. ఇప్పుడే కాదు గత 9 ఏళ్ల నుంచి తమపై ఫిర్యాదులు ఇస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్-బీజేపీల వేట కుక్కలను తమపై ఊసిగొల్పారని తీవ్రస్థాయిలో విమర్శించారు. సీబీఐ, విజిలెన్స్, సీవీసీకి లేఖలు రాశారు కదా అని అడిగారు. మోడీ పాలనలో నిరుద్యోగం, అప్పులు మాత్రమే పెరిగాయని కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీ చేసే ఆరోపణలను జనం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ హోదా ఏంటీ అని కేటీఆర్ అడిగారు.