Medaram Jatara:తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన పండగ మేడారం సమ్మక్క సారాలమ్మ (Sammakka Saralamma) జాతర. 2024లో జాతర తేదీలను ఆలయ పూజారులు ప్రకటించారు. జాతర రెండేళ్లకోసారి జరుగుతుందనే సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 21వ తేదీన సారలమ్మ(saaralamma), పగిడిద్దరాజు (pagididda raju), గోవిందరాజును (govinda raju) గద్దె వద్ద తీసుకువస్తారు. ఫిబ్రవరి 22వ తేదీన సమ్మక్క దేవతను గద్దె వద్దకు తోడుకొని వస్తారు. ఫిబ్రవరి 23వ తేదీన భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 24వ తేదీన దేవతల వన ప్రవేశం జరుగుతుంది. ఫిబ్రవరి 28వ తేదీన జాతర పూజ ముగింపు కార్యక్రమం తిరుగువారం ఉంటుంది.
సమ్మక్క సారాలమ్మ (Sammakka Saralamma) జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు పొటెత్తుతారు. పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర (maharashtra), ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్ (madhya pradesh) నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ గిరిజనులే ఆలయ పూజారులుగా వ్యవహరిస్తారనే సంగతి తెలిసిందే.