Minister Konda Surekha: అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. సురేఖకు జ్వరం వచ్చి అయిదు రోజులు అవుతుంది. అయినా సరే జ్వరం తగ్గకపోవడంతో డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి డెంగ్యూ పాజిటివ్‌గా గుర్తించారు. ప్రస్తుతం కొండా సురేఖ హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ.. రోజువారి కార్యక్రమాలను మంత్రి పర్యవేక్షిస్తున్నారు. మేడారం జాతర పనుల పురోగతిని, ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీటికి సంబంధించి అవసరమైన సూచనలు చేశారు. కొండా సురేఖ మరో రెండు, మూడు రోజుల్లో కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. మేడారం సమ్మక్క, సారక్క జాతరలో మంత్రి పాల్గొంటారని తెలిపారు.