»Boney Kapoor Reacts To Janhvi Kapoor Opposite Ram Charan In Rc16
Boney Kapoor: రామ్ చరణ్ సరసన జాన్వీకపూర్.. స్పందించిన బోనీ కపూర్
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఆర్సీ16 సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ ఫిక్స్ అయిందంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా బోనీ కపూర్ మాటలకు ప్రధాన్యత సంతరించుకుంది.
Boney Kapoor reacts to Janhvi Kapoor opposite Ram Charan in RC16
Boney Kapoor: వెండితెరపై చిరంజీవి, శ్రీదేవి జంట ఎలా ఉంటుందో చూశాము. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా ఇండస్ట్రి హిట్‌గా నిలిచింది. అలాగే వీరి వారసులు రామ్ చరణ్, జాన్వీ కపూర్ ఇద్దరు కలిసి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, జాన్వీ తండ్రి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్పందించారు. ఓ ఇంటర్వూలో పాల్గొన్న ఆయన జాన్వీ కపూర్ మంచి నటీ అని నిరుపించుకోవడానికి సౌత్‌లో అద్భతమైన అవకాశాలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర చిత్రంలో హీరోయిన్గా జాన్వీ నటించడం సంతోషం అని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే జాన్వీ తెలుగు నేర్చుకుంటుంది అని అందుకోసం తెలుగు సినిమాలు చూస్తున్నట్లు వెల్లడించారు.
తెలుగులో మరో స్టార్ హీరో రామ్ చరణ్‌తో కూడా జాన్వీ నటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇద్దరు చాలా గొప్ప నటులే, వారెంటో ఆర్ఆర్ఆర్ చిత్రంలో చేశాము. వారి పక్కన నటిస్తున్న జాన్వీ చాలా విషయాలను నేర్చుకుంటదని తెలిపారు. తన భార్య శ్రీదేవి చాలా భాషాల్లో నటించి మెప్పించిందని, అలాగే తన కూతురు కూడా అందరిని ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే హీరో సూర్య పక్కన కూడా నటిస్తున్నట్లు తెలిపారు. ధడక్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టని జాన్వీకి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. ఇక తెలుగులో ఈ అమ్మడికి హిట్ పడితే బిజీ హీరోయిన్గా మారిపోతుంది అని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.