అలలా ఎగిసిపడినట్టుగా ఉంది శ్రీలీల పరిస్థితి. ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడిందో.. అంతకుమించిన ఫోర్స్‌తో కిందకి పడిపోయింది అమ్మడు. దీంతో శ్రీలీల వాట్ నెక్స్ట్ అనేది హాట్ టాపిక్‌గా మారింది. కానీ అమ్మడిని కాపాడాలంటే ఆ ఇద్దరి చేతుల్లోనే ఉంది.
Srileela: ఇప్పటి వరకు శ్రీలీల నటించిన సినిమాల్లో ధమాకా, భగవంత్ కేసరి తప్పితే.. ఫస్ట్ సినిమా పెళ్లి సందడి మొదలుకొని స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం సినిమాలు ఆశించిన స్థాయిలో మంచి రిజల్ట్స్ ఇవ్వలేకపోయాయి. అయితే కెరీర్ స్టార్టింగ్‌లో వరుస ఆఫర్స్ అందుకున్న శ్రీలీల.. గుంటూరు కారం తర్వాత గ్యాప్ ఇచ్చేసింది. అయితే ఈ గ్యాప్ ఆమె ఇచ్చింది కాదు.. అమ్మడికి అసలు ఆఫర్లు రావడం లేదనేది ఇండస్ట్రీ టాక్. కానీ కథల ఎంపిక ఇలాగే ఉంటే అమ్మడి కెరీర్ డేంజర్ జోన్లో పడినట్టేనని అంటున్నారు. ఇప్పటికైన ఆచితూచి సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది.
శ్రీలీల కూడా ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకొని బ్రేక్ తీసుకొని చదువుపై ఫోకస్ చేయాలని డిసైడ్ అయిందట. అలాగే బ్రేక్ తర్వాత మరింత జాగ్రత్తగా స్కిప్ట్స్ ఓకే చేయాలని భావిస్తుందట అమ్మడు. కానీ అలా జరగాలంటే.. ప్రజెంట్ శ్రీలీల చేతిలో ఉన్న సినిమాలు ఆడాలి. లేదంటే ఈ యంగ్ బ్యూటీ కెరీర్ క్లోజ్ అయినట్టే. నెక్స్ట్ పవన్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటిస్తోంది శ్రీలీల. అయితే.. ఉస్తాధ్ భగత్ సింగ్ మూవీ పవన్ పాలిటిక్స్ కారణంగా ఇప్పట్లో తిరిగి స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పవన్ డేట్స్ ఇస్తే.. హరీష్ శంకర్ ఈ సినిమాను మొదలు పెట్టాలి.
ఈలోపు మిస్టర్ బచ్చన్ కంప్లీట్ చేయాలి హరీష్. కాబట్టి ఉస్తాద్ రావడానికి చాలా సమమం ఉంది. అయితే.. నితిన్‌తో కలిసి ‘రాబిన్‌హుడ్’ అనే సినిమాలో నటిస్తోంది శ్రీలీల. ఈ ప్రాజెక్ట్ నుంచి అమ్మడు తప్పుకుందని వినిపించినప్పటికీ.. అందులో నిజం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఆమెపై 30 శాతం షూటింగ్ చేశారట. త్వరలోనే మళ్లీ షూటింగ్లో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి.. శ్రీలీలను పవన్, నితిన్ ఇద్దరే కాపాడాలి. లేదంటే.. ఇక అంతే సంగతులు.