Smartphone : ఫోన్ పోయినా స్విచాఫ్ కాకూడదంటే ఈ సెట్టింగ్స్ చేసుకోవాల్సిందే!
స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. దీన్ని ఎన్ని వేల రూపాయలు పెట్టి కొనుక్కున్నా.. భద్రంగా ఉంచుకోవడమూ అంతే ముఖ్యం. పొరపాటున ఫోన్ పోగొట్టుకున్నా అది స్విచ్ ఆఫ్ కాకుండా ఉండాలంటే... ఈ సెట్టింగ్స్ చేసుకోవాల్సిందే.
Smartphone Safety Tips : చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు ఫోన్‌ని పోగొట్టుకుంటూనే ఉంటారు. అలాంటప్పుడు అది దొరికిన వారు వెంటనే దాని నుంచి సిమ్‌ని తీసేసి స్విచాఫ్ చేసేస్తుంటారు. అప్పుడు దాన్ని దొరకబట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇలాంటి సమయంలో మన ఫోన్ స్విచాఫ్ కాకుండా ఉంటే ఎలాగోలా దాన్ని రికవర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకు మన ఫోన్లో ఓ సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే…
మన ఫోన్(phone) సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఒక సెట్టింగ్‌ని మార్చడం ద్వారా ఈ వెసులుబాటు కలుగుతుంది. ఫోన్ ఆన్ చేయడానికి మన పాస్వర్డ్ ఎలాగైతే ఎంటర్ చేయాలో.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి కూడా ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన పాస్ వర్డ్ ఏంటో వారికి తెలిసే అవకాశం ఉండదు కాబట్టి ఫోన్ స్విచ్ఛాఫ్ కాదు. మరి ఇందుకోసం సెట్టింగ్స్‌లో ఈ మార్పులు చేయాలి.
ముందుగా మన స్మార్ట్ ఫోన్లో ‘సెట్టింగ్స్’ లోకి వెళ్లాలి. స్క్రీన్‌ను కిందకు స్క్రోల్ చేస్తే పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ(Password & Security) ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత అందులో సిస్టమ్ సెక్యూరిటీ(System Security) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్లాలి. తర్వాత డివైజ్ సెక్యూరిటీ(Device Security) సెక్షన్లో రిక్వైర్ పాస్వర్డ్ టూ పవర్ ఆఫ్(Require Password to Power Off) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి పవర్ ఆఫ్ బటన్ ఎనేబుల్ చేయాలి. ఆ తర్వాత బ్యాక్ వచ్చి.. ఫైండ్ మై డివైజ్(Find My Device) ఆప్షన్‌ను కూడా ఎనేబుల్ చేసుకోవాలి.
ఇంతటితో సెట్టింగ్స్ కంప్లీట్ అయిపోయినట్టే.