»Motorola Edge 40 Neo Latest Smartphone Amazing Features
Motorola Edge 40 Neo తాజా స్మార్ట్‌ఫోన్… అద్భుతమైన ఫీచర్స్
మోటరోలా కంపెనీ తన తజా స్మార్ట్ ఫోన్ మోటరోలా ఎడ్జ్ 40 నియోను భారతదేశంలో ప్రారంభించింది. సరసమైన ధరలకే అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు ఒక సారి చూద్దాం.
Motorola Edge 40 Neo Latest Smartphone... Amazing Features
Motorola Edge 40 Neo: మోటరోలా(Motorola) తన తాజా స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 40 నియో(Motorola Edge 40 Neo )ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఎడ్జ్ 40 విజయవంతంగా ప్రారంభమైన తర్వాత అద్భుతమైన గాడ్జెట్ నుంచి ఎడ్జ్ 40 సిరీస్‌లో రెండవ విడతగా Edge 40 Neo ను ప్రవేశపెట్టింది. దీనిలో 144Hz స్క్రీన్, పెద్ద 5,000mAh బ్యాటరీ, 12GB RAM తో పాటు 5G కనెక్టివిటీ వంటి కొన్ని అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.
సరికొత్త స్పోర్ట్స్ IP68 ఫీచర్‌తో 6.55 అంగుళాల pOLED (Plastic Organic Light Emitting Diode) 10-బిట్ స్క్రీన్ కలిగి ఉంది. అలాగే 144Hz రిఫ్రెష్ రేట్, 409 ppi ఆకట్టుకునే పిక్సెల్ కలిగి ఉంది. డైమెన్సిటీ 7030 ప్రాసెసర్ ఇచ్చారు. 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, ఎడ్జ్ 40 నియో డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, 50MP ప్రైమరీ షూటర్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 13MP అల్ట్రా-వైడ్ కెమెరా సెన్సార్ కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా 32 MP తో మీ సెల్ఫీ అవసరాలను తీరుస్తుంది. అదనపు భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా కలిగి ఉంది, IP68 రేటింగ్ దుమ్ము, ధూళి నిరోధకతను కలిగి ఉంది. 8GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర రూ. 23,999. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో రూ. 25,999 ఉంది. ప్రత్యేక పండుగ ధర ఆఫర్లో రూ. 20,999కే బేస్ మోడల్, రూ. 22,999కు హై-ఎండ్ మోడల్‌ను పొందవచ్చు. దీని కొనుగోలును సెప్టెంబర్ 28వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రారంభించవచ్చు. ఇది ఫ్లిప్‌కార్ట్, మోటరోలా వెబ్సైట్, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.