»Donald Trump Passed Away I Will Run In 2024 Tweet Viral John Trump Junior
Donald Trump: ట్రంప్ మృతి..2024లో నేను పోటీ చేస్తా?
యూఎస్ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కోడుతుంది. అయితే ట్రంప్ చనిపోయాడని, ఈ క్రమంలో 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని ట్రంప్ పెద్ద కుమారుడు డోనాల్డ్ జాన్ ట్రంప్ జూనియర్ ట్వీట్ చేసినట్లుగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఇది నిజమేనా ? ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
donald Trump passed away i will run in 2024 tweet viral junior trump
అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(donald Trump) చనిపోయారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ పోస్టులో “నా తండ్రి డొనాల్డ్ ట్రంప్ మరణించారు. నేను 2024లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించడం విచారకరమని ఉంది. ఇది స్వయంగా డోనాల్డ్ ట్రంప్ కుమారుడు జాన్ ట్రంప్(john trump junior)జూనియర్ ఖాతా నుంచి పోస్ట్ కావడంతో అనేక మంది నిజమని నమ్మేశారు. ఆ క్రమంలో వరుస సందేశాలు కూడా చేయడం మొదలు పెట్టారు. అంతేకాదు ఏకంగా 10 మిలియన్ల మందికి ఆ పోస్టు రీజ్ కూడా అయ్యింది.
ఈ పోస్టు గురించి ఆ అకౌంట్ హ్యాక్ అయినట్లు ట్రంప్ ఆర్గనైజేషన్ తెలిపింది. Mr ట్రంప్ జూనియర్ ప్రతినిధి ఆండ్రూ సురబియన్ Xలో అది నిజం కాదని పోస్ట్ చేశారు. డోనాల్డ్ ట్రంప్ గతంలో ట్విట్టర్ హింసను ప్రేరేపించే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాదు 2021లో అతని X ఖాతా సస్పెండ్ చేయబడిన తర్వాత..అతను ఏకంగా ట్రూత్ సోషల్ అనే ప్లాట్ ఫాంను స్థాపించారు. తర్వాత గత నవంబర్‌లో ట్విట్టర్ అతని ఖాతాను పునరుద్ధరించింది. కానీ Mr ట్రంప్ జూనియర్(john trump junior) మాత్రం ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే నిజంగా హ్యాక్ జరిగిందా? లేదా అతని కుమారుడికి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉందా? మరెవరైనా కావాలనే ఇలా చేయించారా అనేది తెలియాల్సి ఉంది.