»Minister Seethakkas Suggestion To The Vips Coming To Medaram
Seethakka: మేడారం వచ్చే వీఐపీలకు మంత్రి సీతక్క సూచన
మేడారం వచ్చే వీఐపీలకు మంత్రి సీతక్క ఓ సూచన చేశారు. అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ వేడుకకు కోట్ల మంది వచ్చారని ఇక ఫిబ్రవరి 21, 22న జరగబోయే జాతరకు ఇంకా అధిక సంఖ్యలో భక్తులు హాజరు కానున్నట్లు వెల్లడించారు.
Minister Seethakka's suggestion to the VIPs coming to Medaram
Seethakka: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే 17 కోట్ల మంది మహిళలు జీరో టిక్కెట్‌తో ప్రయాణించారని మంత్రి సీతక్క తెలిపారు. అంబరాన్ని అంటేలా ఎంతో ఘనంగా జరుగుతున్న మేడారం జాతరకు ఇంకా ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఓ సూచన చేశారు. వీఐపీలు తమ వాహనాలను ములుగులో ఉంచి బస్సుల్లో మేడారం జాతరకు రావాలని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు.
సోమవారం మేడారంలో జాతరను పర్యవేక్షించారు. జాతరలో వేల సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులను పర్యవేక్షణలో భాగంగా నియమించామన్నారు. ఈ 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరుగుతుందని, ఆ రెండు రోజుల్లో దాదాపు 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా అని అందుకోసం తగిన సదుపాయాలు రెడీ చేసినట్లు వెళ్లడించారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ఇదే తొలిసారి అని, జాతరను శాంతియుతంగా జరుపుతున్న అధికారులకు, భక్తులకు ధన్యవాదాలు తెలిపారు.