»Maharashtra Brs Party Chief K Chandrashekhar Rao Opens Training Session In Nanded
Maharashtraలో బీఆర్ఎస్ శిక్షణా శిబిరం.. దూసుకెళ్లాలని సీఎం కేసీఆర్ ఆదేశం
చాలా చిన్న దేశాలైన సింగపూర్, మలేషియా గొప్పగా అభివృద్ధి చెందాయి. కానీ 75 ఏళ్లయినా భారతదేశం ఇంకా అభివృద్ధి చెందలేదు. ఇంకా సమస్యలు పరిష్కారం కావడం లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు. దశాబ్దాలుగా ఆ పార్టీ గెలిస్తే ఏం జరిగింది?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తొలిసారి బీఆర్ఎస్ (Bharat Rashtra Samithi) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (K Chandrashekhar Rao) స్పందించారు. కాంగ్రెస్ గెలవడంపై స్పందిస్తూ ‘దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తోంది. ఇప్పుడు కూడా గెలిచింది. అయితే ఇన్నాళ్లు ఏం జరిగింది?’ అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో (Maharashtra) బీఆర్ఎస్ కార్యకర్తల శిక్షణా శిబిరాన్ని కేసీఆర్ ప్రారంభించి దిశానిర్దేశం చేశారు.
నాందేడ్ (Nanded)లో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ (KCR) ప్రారంభోపన్యాసం చేశారు. దేశం మొత్తం మార్పు తీసుకురావాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ (- BRS Party) ఆవిర్భవించినట్లు పునరుద్ఘాటించారు. ‘దేశం మొత్తం మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ఆవిర్భవించింది. చాలా చిన్న దేశాలైన సింగపూర్, మలేషియా గొప్పగా అభివృద్ధి చెందాయి. కానీ 75 ఏళ్లయినా భారతదేశం (India) ఇంకా అభివృద్ధి చెందలేదు. ఇంకా సమస్యలు పరిష్కారం కావడం లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు. దశాబ్దాలుగా ఆ పార్టీ గెలిస్తే ఏం జరిగింది? ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు ప్రజలు’ అని స్పష్టం చేశారు.
‘తెలంగాణలో (Telangana) ఏడేళ్ల కృషితో ఎన్నో సమస్యలు పరిష్కరించాం. నోట్ల రద్దుతో , కరోనాతో మొత్తం మూడేళ్లు ఇబ్బంది పడ్డాం. అకోలా, ఔరంగాబాద్ వంటి ప్రాంతాల్లో వారానికోసారి తాగునీరు వస్తోంది. ఢిల్లీలో కూడా నీటి సమస్య ఎదురవుతోంది. తెలంగాణలో ఇంటింటికి నల్లా ద్వారా తాగునీరు ఇస్తున్నాం. పట్టణాల్లో ఒక రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తున్నాం. తెలంగాణలో సాధ్యమైంది మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కాదు?. ’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
‘మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో రోజుకో రైతు ఆత్మహత్యకు (Farmers Suicide) పాల్పడుతున్నాడు. మహారాష్ట్ర-తెలంగాణ మధ్య ప్రత్యేక బంధం ఉంది. మహారాష్ట్ర-తెలంగాణ మధ్య వేల కిలోమీటర్ల సరిహద్దు ఉంది’ అని గుర్తు చేశారు. దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణ మోడల్ (Telangana Model) రావాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కాగా రేపు కూడా ఈ శిక్షణ శిబిరం కొనసాగుతుంది. శిబిరం అనంతరం పార్టీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లనున్నారు.