NLR: రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆత్మకూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఆత్మకూరు ఆర్డీవో పావనిని నియమించారు. ఈ నియామకం ఆరు నెలల పాటు అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పరిణామంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిందనే చర్చ రాజకీయవర్గాల్లో ఊపందుకుంది.