Kishan Reddy : దోపిడీ చేసి విమానాలు కొంటున్నారు.. కేసీఆర్ పై కిషన్ రెడ్డి
Kishan Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. ఇతర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న నేతలకు కేసీఆర్ బీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారని ఆయన విమర్శించారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. ఇతర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న నేతలకు కేసీఆర్ బీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ తొమ్మిదేళ్లలో బంగారు తెలంగాణ నిర్మాణం జరగలేదు కానీ.. కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయిందన్నారు.
కేసీఆర్ అధికారంలో ఉన్నత కాలం తెలంగాణలో పేద ప్రజలకు ఇళ్లు ఇచ్చే అవకాశం లేదన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణలో దోపిడి చేసిన డబ్బుతో ఫామ్ హౌస్ లు, విమానాలు కొంటోందన్నారు. పార్టీలు పెట్టి దేశ వ్యాప్తంగా తమ పార్టీలో చేరమని బీఆర్ఎస్ పార్టీ పంచుతోందని ఆరోపించారు.
1200 మంది అమరవీరుల ప్రాణ త్యాగం ద్వారా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం.. కల్వకుంట్ల కుటుంబం పాలైందన్నారు. తండ్రీకొడుకుల అబద్ధాలకు నోబెల్ బహుమతి ఇవ్వాలన్నారు.
పక్క రాష్ట్రంలో 30 లక్షల ఇల్లులు కడుతున్నారు.. కానీ మన రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా లేదని మండిపడ్డారు. ఏ మాఫియాలో చూసినా కేసీఆర్ కుటుంబం ఉందని, రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం పోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.