నిర్మల్ పట్టణంలో ప్రముఖ కవి అంబటి నారాయణ రచించిన ‘పుడమిని ముద్దాడిన పొద్దు’ పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి గుడిపాటి పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం సామాజిక, మానవీయ, నైతిక విలువల సమాహారమని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు పాల్గొన్నారు.