కోనసీమ: మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి ఆలయంలో అమలు చేస్తున్న నిత్య అన్న ప్రసాదం ట్రస్టుకు కాకినాడకు చెందిన చింతపల్లి మాధవరాజు, శ్రీలక్ష్మి దంపతులు రూ. 1,00,008 విరాళంగా అందించారు. విరాళాన్ని ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణికి ఆదివారం అందజేశారు. అనంతరం దాతల కుటుంబానికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందించారు.