హైదరాబాద్(Hyderabad)లో మరోసారి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఏకకాలంలో 15 చోట్ల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల, అనుచరుల ఇళ్లతోపాటు ఓ ఫార్మా కంపెనీ (Pharma company)కి చెందిన డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాలు, సిబ్బంది ఇళ్లల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సంస్థకు సంబంధించి ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం.ఇప్పటి వరకు రాజకీయ నాయకులను టార్గెట్ చేసిన ఐటీ అధికారులు(IT officers).. ఇప్పుడు ఫార్మా కంపెనీలను టార్గెట్ చేసినట్లుగా సమాచారం.
ఎన్నికల దగ్గరపుడతున్న వేళ రాజకీయ నాయకులకు ఫార్మా కంపెనీలు ఫండింగ్ ఇచ్చే ఛాన్స్ ఉందని.. అందులో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నట్లు తెలిసింది. ఏయితే ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక నాలుగు రోజుల క్రితం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు దాడులు చేశారు. ఖమ్మంతో పాటు హైదరాబాద్లో ఆయన చెందిన ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ దాడులు జరిగాయి.
వారం క్రితం మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు (Congress leaders) పారిజాత నర్సింహ్మా రెడ్డి, ఆ పార్టీ అభ్యర్థి కేఎల్ఆర్, మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలోనూ ఐటీ దాడులు జరిగాయి. ఖమ్మం జిల్లాకే చెందిన తుమ్మల నాగేశ్వరావు ఇంట్లో పోలీసుల సోదాలు జరిగాయి. ఈ దాడులపై స్పందించిన కాంగ్రెస్ నేతలు.. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కై తమ పార్టీ నేతల ఇళ్లే లక్ష్యంగా దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇవి కక్షపూరితంగా చేయిస్తున్న ఐటీ దాడులను వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabita) బంధువుల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరగటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.