తెలంగాణ(Telangana) ఎన్నికల సమరం మొదలైంది. పార్టీలు కదనరంగంలోకి దిగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) హ్యాట్రిక్ విజయం పైన ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్(Congress) ఈ సారి గెలుపు తమదేనని విశ్వాసంతో ఉంది. ఈ సమయంలో బీజేపీ(BJP) మేము సైతం అంటూ రంగంలోకి దిగుతోంది. ఈ సమయంలోనే సర్వేలు ప్రజానాడిని స్పష్టం చేస్తున్నాయి. ఫ్లాష్ సర్వే (Flash survey)రిపోర్టులు చూసి బీఆర్ఎస్ (BRS) నాయకులు షాక్ గురువుతున్నట్టు తెలిసింది. మేనిఫెస్టో లోని అంశాలు, సీఎం కేసీఆర్ పబ్లిక్ మీటింగ్స్ ద్వారా బీఆర్ఎస్ క్షేత్ర స్థాయిలో జోష్ పెరుగుతుందని అంచనా వేశారు. కేసీఆర్ స్పీచ్‌కు ప్రజల నుంచి అనుకున్నట్టుగా పాజిటివ్ రియాక్షన్ రాలేదనే అనుమానం నేతలలో కనిపిస్తున్నది.
గతంలో బీఆర్ఎస్ నిర్వహించే సభలకు ప్రజలు స్వచ్ఛందంగానే వచ్చేవారు. కేసీఆర్ ప్రసంగం విన్నాక జోష్‌లో కనిపించేవారు. కానీ ప్రస్తుత సభలకు ప్రజలను తరలించడం చాలెంజ్‌గా మారిందని, పైసలు ఇస్తే తప్పా జనాలు వచ్చే అవకాశం లేదని గులాబీ లీడర్లు ఆవేదన చెందుతున్నారు.ఈనెల 15 న ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన తరువాత సీఎం కేసీఆర్ వరుసగా నాలుగు రోజుల పాటు ఏడు పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ (Telangana) సర్కారు కొనసాగిస్తన్న పథకలు, మళ్లీ అధికారంలోకి వస్తే అమలు చేసే కొత్త హామీల గురించి ప్రజలకు వివరించారు. అదే సమయంలో కాంగ్రెస్, ఆపార్టీ లీడర్లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే కేసీఆర్ పబ్లిక్ మీటింగ్స్ (Public meetings) పాల్గొన్న ఏరియాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయావకాశాలు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ గురించి ఏమనుకుంటున్నారు? అని ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ (Congress party) ప్రకటించిన ఆరు గ్యారెంటీల పట్ల ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడిందనే ప్రచారం ఉంది. ప్రధానంగా మహిళలు ఆకర్షితులవుతున్నట్టు టాక్ ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ను కట్టడి చేసేందుకు కౌంటర్ మేనిఫెస్టోను ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ కు పాజిటివ్ ఏర్పడిందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నట్టు ప్రగతిభవన్ (Pragatibhavan)కు సన్నిహితంగా ఉండే లీడర్లు తెలిపారు. అయితే కాంగ్రెస్ బస్సు యాత్ర కొనసాగిన ప్రాంతాల్లోనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. రాహుల్ రోడ్ షో (Rahul Road Show) తరువాత కాంగ్రెస్ గురించి ఏమనుకుంటున్నారు? అదే సమయంలో బీఆర్ఎస్ గురించి ఏ విధంగా స్పందిస్తున్నారు? అనే అంశాలను ఆరా తీస్తున్నారు.