»Urvashi Rautela Bollywood Beauty Urvashi Rautela On The Condition That She Will Give Me A Phone If She Helps In The Treatment
Urvashi Rautela: వైద్యానికి సాయం చేస్తే ఫోన్ ఇస్తానని కండీషన్..షాకైన బాలీవుడ్ బ్యూటీ
అహ్మదాబాద్‌లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా తన బంగారు ఐఫోన్‌ను పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఫోన్ తన వద్ద ఉందని ఓ వ్యక్తి ఊర్వశికి మెయిల్ చేశాడు. ఫోన్ ఇవ్వాలంటే తన సోదరుడిని క్యాన్సర్ వ్యాధి బారి నుంచి రక్షించేందుకు ఆర్థిక సాయం చేయాలని ఆ వ్యక్తి కోరాడు. ఆ కండీషన్‌పై ఊర్వశి కూడా స్పందించింది.
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) తన బంగారు ఐఫోన్‌ను (Gold iPhone) పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. వన్డే వరల్డ్ కప్ (Odi World Cup)లో భాగంగా అహ్మదాబాద్ (Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం భారత్, పాక్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన ఊర్వశికి షాక్ తగిలింది. ఆమె తన 24 క్యారెట్ల బంగారు ఐఫోన్ (24 Carat Real Gold iPhone) ను పోగొట్టుకుంది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. తన ఫోన్ ఇస్తే బహుమతి కూడా ఇస్తానని సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
తాజాగా ఊర్వశి (Urvashi Rautela) ఫోన్ తన వద్ద ఉందని ఓ వ్యక్తి ఆమెకు మెయిల్ చేశాడు. ఆ ఫోన్‌ను తిరిగి ఇచ్చేందుకు ఓ కండిషన్ కూడా పెట్టాడు. ఫోన్ తన వద్ద ఉందని, అది తిరిగి ఇవ్వాలంటే తనకు సాయం చేయాలని ఆ వ్యక్తి కోరాడు. తన సోదరుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని, అతన్ని క్యాన్సర్ బారి నుంచి రక్షించేందుకు ఆర్థిక సాయం చేయాలని మెయిల్ ద్వారా తెలిపాడు.
ఆ వ్యక్తి మెయిల్‌పై ఊర్వశి కూడా స్పందించింది. థమ్స్ అప్ సింబల్‌తో రిప్లై ఇచ్చింది. ఆ స్క్రీన్ షాట్‌ను ఊర్వశి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ అవుతోంది. ఆ మెయిల్ అక్టోబర్ 16వ తేదిన వచ్చిన్నట్లు తెలిపిన ఊర్వశి (Urvashi Rautela) , అతని వివరాలను మాత్రం వెల్లడించలేదు. తన ఫోన్ పోగొట్టుకున్న సమయంలో ఊర్వశి పోస్ట్ చేస్తూ రివార్డు ఇస్తానన్న సంగతి తెలిసిందే.