»Hot Beauty Urvashi Rautela Lost Her Gold Iphone In India Pak Match
Urvashi Rautela: భారత్-పాక్ మ్యాచ్‌లో గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న హాట్ బ్యూటీ
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా తన గోల్డ్ ఐఫోన్‌ను పోగొట్టుకుంది. భారత్, పాక్ మ్యాచ్ చూడ్డానికి ఆమె నరేంద్రమోడీ స్టేడియంకి వెళ్లగా తన ఫోన్‌ను పోగొట్టుకున్నానని, ఎవరికైనా దొరికితే తిరిగి ఇచ్చేయాలని ఆమె సోషల్ మీడియా ద్వారా వేడుకుంది.
టాలీవుడ్ (Tollywood) మూవీస్‌లో ఇప్పటి వరకూ నాలుగు ఐటెం సాంగ్స్‌లో తళుక్కుమని విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న తార ఊర్వశి రౌటేలా (Urvashi Rautela). మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో బాస్ పార్టీ, ‘ఏజెంట్’లో వైల్డ్ సాలా, ‘బ్రో’ మూవీలో మై డియర్ మార్కండేయ, ‘స్కంద’లో కల్ట్ మామా పాటల్లో డ్యాన్స్ వేసి కుర్రకారును హుషారెత్తించింది. ప్రస్తుతం ఊర్వశి హిందీలో ‘దిల్ హై గ్రే’ అనే మూవీలో నటిస్తోంది.
తాజాగా సోషల్ మీడియాలో వేదికగా ఊర్వశి తన బాధను చెప్పుకుంది. శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Ahmedabad NarendraModi Stadium)లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ (IND vs Pak Match)కు ఊర్వశి వెళ్లింది. అయితే ఆ సమయంలో తన ఖరీదైన ఫోన్‌ను పోగొట్టుకుంది. అది 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన గోల్డ్ ఐ ఫోన్ అని చెబుతూనే ఓ నోట్‌ను షేర్ చేసింది.
తన ఫోన్ దొరికితే ఇవ్వాలని కోరుతూ ఊర్వశి చేసిన పోస్ట్:
ఎవరికైనా తన గోల్డ్ ఐఫోన్ (Gold iPhone) దొరికితే వెంటనే తనకు తెలియజేయాలని, తనను వెంటనే కాంటాక్ట్ అవ్వాలని ఊర్వశి సోషల్ మీడియాలో వేడుకుంది. ప్రస్తుతం ఊర్వశి వాడే ఆ గోల్డ్ ఐఫోన్ లక్షల ఖరీదు విలువ చేస్తుంది. 24 క్యారట్ల బంగారంతో చేసిన ఫోన్ పోవడం వల్ల ఎవరైనా ఆ ఫోన్‌ని అన్‌లాక్ చేసే అవకాశం ఉంది. అలా జరిగితే ఆమె డేటా మొత్తం దొరికిపోయే ప్రమాదం ఉంది. ఆమె పర్సనల్ ఫోటోలు, ఇతర సమాచారం కూడా తెలియపోతుందని తెలిసి ఊర్వశి భయపడిపోతోంది.
సాధారణంగా ఐఫోన్ (iphone)ను ఇతరులు అన్‌లాక్ చెయ్యడం అంత సులభమేమీ కాదు. గ్రౌండ్ లోని జనసంద్రంలో తన ఐఫోన్ పోగోట్టుకున్నానని, దొరికినవాళ్లు దయచేసి తనకు తిరిగి ఇచ్చేయాలని ఆమె కోరింది. తన నోట్‌ను అహ్మదాబాద్ పోలీసులకు (Ahmadabad Police) కూడా ట్యాగ్ చేసింది.