SRD: కంగ్టి మండలం దెగులవాడి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని CDPO సుజాత, సూపర్వైజర్ మంజుల సోమవారం సందర్శించి తనిఖీ చేశారు. స్థానిక చిన్నారుల ఆరోగ్యం, బరువు ప్రామాణికం పరిశీలించారు. గర్భవతులు, చిన్నపిల్లలకు సకాలంలో పౌష్టికాహారం అందించాలని టీచర్ దేవికి సూచించారు. అదేవిధంగా ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించి, మాతా శిశు ఆరోగ్యం మెరుగుకు కృషి చేయాలని తెలిపారు.