KRNL: ఆదోని జిల్లా సాధన ఉద్యమాన్ని రోజురోజుకు మరింత తీవ్రతరం చేస్తామని సాధన సమితి జేఏసీ నాయకులు రఘురామయ్య, నూర్ అహ్మద్ తెలిపారు. జిల్లా సాధన కోసం ఆదోనిలో చేపట్టిన దీక్షలు సోమవారం 51వ రోజుకు చేరుకున్నాయని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదోనిని అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీని టీడీపీ విస్మరించడం తగదన్నారు.