JGL: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటుకు సమానంగా మెరుగైన వైద్యం అందుతోందని, గర్భిణీలు ప్రభుత్వ వైద్యశాలల్లోనే ప్రసవాలు చేసుకోవాలని పెగడపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ నరేశ్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలు చికిత్సలు అందించి అవసరమైన మందులను ఆయన అందజేశారు.