NZB: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా జిల్లా యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. మంగళవారం జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కీలక సమావేశం జరగనుంది. ప్రధానంగా బోధన్ పట్టణ పరిధిలోని ఎన్నికల ఏర్పాట్లు, ఓటరు జాబితా సవరణలు, పోలింగ్ కేంద్రాల మార్పుచేర్పులపై ఈ భేటీలో చర్చించనున్నారు.