MDK: నర్సాపూర్ మండల కేంద్రంలో సోమవారం విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి విశ్రాంత ఉద్యోగుల సంఘం పిలుపునిచ్చింది. దీంతో విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.