అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల బంధానికి ప్రతీకే రక్షాబంధన్ (Raksha Bandhan). దేశవ్యాప్తంగా ప్రజలు ఈ పండగను వేడుకగా జరుపుకుంటారు. రాఖీ (Rakhi) పండగ సందర్భంగా ఓ అవ్వ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video viral) అవుతోంది. ఆ అవ్వ తన తమ్ముడికి రాఖీ కట్టడానికి ఏకంగా 8 కిలోమీటర్లు నడిచింది. దూరంగా ఉన్న తన తమ్ముడి వద్దకు వెళ్లి రాఖీ కట్టి ఎంతో సంతోషించింది. ఈ ఘటన కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని కొత్తపల్లిలో చోటుచేసుకుంది.
రాఖీ కట్టేందుకు 8 కిలోమీటర్లు నడిచి వెళ్లిన అవ్వ వీడియో:
కొత్తపల్లి (Kothapalli)కి చెందిన ఓ అవ్వ తన తమ్ముడి వద్దకు బయల్దేరింది. పొరుగున ఉన్న కొండయ్యపల్లి (Kondaiahpalli)లో తన తమ్ముడు నివశిస్తున్నాడు. ఓ బాటసారి ఆ అవ్వ వెళ్లడాన్ని గమనించి పలుకరించాడు. తన తమ్ముడికి రాఖీ (Rakhi) కట్టేందుకు వెళ్తున్నానని ఆ అవ్వ బదులిచ్చింది.
తన తమ్ముడు నివశిస్తున్న కొండయ్యపల్లి తన గ్రామానికి 8 కిలోమీటర్ల దూరం ఉంది. తమ్ముడిని తలచుకుంటూ అవ్వ అలా నడిచివెళ్తుండటాన్ని చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. తమ్ముడి మీద ప్రేమ అంటే ఇలానే ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది.