»Good Bye To Another Key Leader Of Karu Party Ponguleti Is The Leader Of The Movement
OU : కారు పార్టీకి మరో కీలక నేత గుడ్ బై.. పొంగులేటి బాటలోనే ఉద్యమనేత..!
అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీకి మరో గట్టి షాక్ తగలబోతోందా?. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీకి దూరం అవుతున్న వేళ తాజాగా మరో కీలక నేత, తెలంగాణ విద్యార్థి నేత కారు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఉస్మానియా యూనివర్సటీ (OU) విద్యార్థి నేత పిడమర్తి రవి (Pidamarthy Ravi) బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్బావం తర్వాత తొలి ఎస్సీ కార్పరొరేషన్ చైర్మన్(SC Corporation Chairman)గా పని చేసిన పిడమర్తి కారు పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రవి బీఆర్ఎస్ (BRS)లో ఉన్న అంతర్గత వర్గపోరు కారణంగా పార్టీ నుంచి బయటకు రాబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన పొంగులేటి శ్రీనివాస్(Ponguleti Srinivas) తో కలిసి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది.
ఇటీవలే బీఆర్ఎస్ (BRS) నుంచి బహిష్కరణకు గురైన పొంగులేటి శ్రీనివాస్ బీఆర్ఎస్ను దెబ్బతీస్తానని, ఉమ్మడి ఖమ్మం (KHAMMAM) నుంచి ఒక్క అభ్యర్థి కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేట్ కూడా తాకకుండా చేస్తానని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు పొంగులేటి వైపు వెళ్లగా.. తాజాగా పిడమర్తి రవి సైతం పొంగులేటి బాటలో నడిచేందుకు ఆసక్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది ఈ సందర్భంగా పొంగులేటితో పిడమర్తి భేటీ అయినట్లు ఓ ఫోటో వైరల్ అవుతోంది. అయితే ఈ ఫోటో ప్రస్తుతానిదా లేక గతంలోనిదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పిడమర్తి రవికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఆయన ఓటమి పాలయ్యారు. మొదటిసారి ఓటమి పాలయిన రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా సీఎం కేసీఆర్ (CM KCR) అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై రవి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. వెన్నుపోటు పొడవడం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య(Sandra Venkata Veeraiah)కు అలవాటైందని, చివర వరకు సండ్ర బీఅర్ ఎస్ పార్టీలో ఉంటారనే గ్యారెంటీ లేదని గతంలో పిడమర్తి రవి చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి.